తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దాదాపు నెలల తర్వాత కూడా  పాజిటివ్ కేసుల ఉద్ధృతి తగ్గడం లేదు. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటి నుంచి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ లో  నిన్న ఒక్కరోజే కొత్తగా 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. కొత్తగా నమోదైన కేసులతోపాటు రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2 వేల 944కు చేరింది. అంటే 3 వేలకు అతి సమీపంలో కేసుల సంఖ్య ఉందన్నమాట. 


[[{"fid":"186208","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


మొత్తం కేసుల్లో 792 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 2092 మందిని రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి చేసి సురక్షితంగా ఇంటికి పంపామని తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 60 మంది కరోనా మహమ్మారికి బలయ్యారని వివరించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..