AP Corona Update: కరోనా మహమ్మారి కేసులు ఆంధ్రప్రదేశ్‌లో స్థిరంగానే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఆంక్షల సడలింపు కారణంగా మొన్నటి వరకూ తగ్గుతూ వచ్చిన కేసులు ఇప్పుడు స్థిరంగా ఉంటున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) తీవ్రత రాష్ట్రంలో మొన్నటి వరకూ తగ్గుముఖం పట్టింది. అయితే గత కొద్దికాలంగా స్వల్పంగా పెరుగుతూ ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో నైట్‌కర్ఫ్యూ ఒక్కటే ఇప్పుడు కొనసాగుతోంది. కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనల్ని పాటించకపోవడం, ఆంక్షల సడలింపు వంటి కారణాలతో కరోనా సంక్రమణ మరోసారి స్వల్పంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో ఏపీలో 56 వేల 720 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1365 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతి చెందారు. మరోవైపు 1466 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13 వేల 796 కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరులో 212, తూర్పు గోదావరి జిల్లాలో 210, కడప జిల్లాలో 153, ప్రకాశం జిల్లాలో 166 కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఘనత సాధించింది. రాష్ట్రంలో రెండు కోట్ల మందికి పైగా మహిళలకి వ్యాక్సినేషన్ వేశారు. దీంతో దేశంలోనే మహిళలకి అత్యధికంగా వ్యాక్సినేషన్ వేసిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 3.83 కోట్ల మంది వ్యాక్సిన్‌(Covid Vaccination)తీసుకున్నారు.


Also read: Newyork: న్యూయార్క్ హోటల్‌లో ఆ దేశాధ్యక్షుడికి నో ఎంట్రీ