Vaccine Drive: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక్కరోజులో భారీగా వ్యాక్సిన్ అందించిన ఘనత సాధించింది. ఏకంగా 13 లక్షలమందికి రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి నియంత్రణకు ఏపీ ప్రభుత్వం(Ap government) కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఓ వైపు కర్ఫ్యూ అమలు చేస్తూనే మరోవైపు వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టింది. ఇంకోవైపు కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా వేగవంతం చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టింది. ఈ డ్రైవ్ ద్వారా ఏపీ ప్రభుత్వం సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఒక్కరోజులో ఏకంగా 13 లక్షలమందికి వ్యాక్సిన్ ఇచ్చిన ఘనతను సొంతం చేసుకుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఒకేరోజు ఇంత పెద్దఎత్తున వ్యాక్సిన్ ఇచ్చిన పరిస్థితి లేదు.


రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌(Mega Vaccine Drive)కు అనూహ్య స్పందన లభించింది. నిన్న ఒక్కరోజే 13 లక్షలమంది వ్యాక్సిన్ అందించింది. వాస్తవానికి 8 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్యం కంటే 5 లక్షలు అదనంగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. రాష్ట్రంలో నిన్న 2 వేల 232 కేంద్రాల్లో డ్రైవ్ నడిచింది. ఇందులో భాగంగా 45 ఏళ్లు పైబడినవారు, ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సిన్ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1.49 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకోగా..పశ్చిమ గోదావరి జిల్లాలో 1.43 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. కృష్ణా జిల్లాలో 1.31 లక్షలు, విశాఖపట్నంలో 1.10 లక్షలు, గుంటూరులో 1.01 లక్షలమంది వ్యాక్సిన్ చేయించుకున్నారు. కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టింది. వ్యాక్సిన్ లభ్యతను బట్టి ప్రత్యైక డ్రైవ్‌లు నిర్వహిస్తోంది. గతంలో రెండుసార్లు డ్రైవ్ ద్వారా ఒకేరోజు 6 లక్షల మందికి వ్యాక్సిన్(Vaccine) అందించింది.


Also read: AP Vaccine Drive: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్, 11 లక్షలమందికి ఒక్కరోజులో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook