Sobha Hymavathi Joins YSRCP: ఏపీలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న టీడీపీకి మరో గట్టి షాక్ తగిలింది. టీడీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోయారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మహిళా విభాగం  మాజీ అధ్యక్షురాలు శోభా హైమావతి, మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు ఇవాళ (జనవరి 27) సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. సీఎం జగన్ పాలన, మహిళల పట్ల వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు నచ్చి తాను పార్టీలో చేరినట్లు శోభా హైమావతి తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీఎం జగన్ మహిళలకు 50 శాతం పదవులు ఇవ్వడం అభినందనీయమని ఈ సందర్భంగా శోభా హైమావతి పేర్కొన్నారు.  రాష్ట్రంలో 90 లక్షల మంది మహిళలకు ఆసరా పథకం అందిస్తున్నారని.. చివరి లబ్దిదారు వరకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వాల్లో ఒక్క గిరిజన మంత్రి కూడా లేరని... కానీ సీఎం జగన్ ఒక గిరిజన మహిళకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని అన్నారు. ఒక దళిత మహిళను రాష్ట్రానికి హోంమంత్రి చేశారని పేర్కొన్నారు. సీఎం జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు..  వైసీపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని శోభా హైమావతి అన్నారు.


మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు మాట్లాడుతూ.. తాను గతంలోనే ఎంపీ విజయసాయి రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరినట్లు తెలిపారు. ఇవాళ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశానన్నారు. గిరిజన ప్రాంతంలో విద్య, వైద్యం తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జగన్ సీఎం కావడం వల్లే రాష్ట్రంలో సామాన్యులకు భరోసా వచ్చిందన్నారు.


కాగా, శోభా హైమావతి ఏడాది క్రితమే టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీలో తనకు తగిన గుర్తింపునివ్వట్లేదని ఆరోపిస్తూ ఆమె టీడీపీని వీడారు. అప్పట్లోనే ఆమె వైసీపీలో చేరనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ఏడాది తర్వాత ఆమె సీఎం జగన్ (CM Jagan) సమక్షంలో ఇవాళ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. శోభా హైమావతి కుమార్తె స్వాతి రాణి ప్రస్తుతం వైసీపీలోనే ఉన్న సంగతి తెలిసిందే.


Also Read: Tamilnadu: తమిళనాడులో కోవిడ్ ఆంక్షల సడలింపు.. నైట్ కర్ఫ్యూ, సండే లాక్‌డౌన్ ఎత్తివేత.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook