Tamilnadu lifts night curfew and sunday lockdown: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి విధించిన పలు ఆంక్షలను సడలిస్తూ గురువారం (జనవరి 27) నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాత్రి పూట కర్ఫ్యూ, సండే లాక్‌డౌన్‌లను ఎత్తివేసింది. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు స్కూళ్లు, కాలేజీలు తెరుచుకుంటాయని వెల్లడించింది. ప్లే స్కూళ్లు, నర్సరీ స్కూళ్లపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇవి మినహా మిగతా ఆంక్షలు ఫిబ్రవరి 15 వరకు రాష్ట్రంలో అమలులో ఉండనున్నట్లు తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) కర్ఫ్యూ ఎత్తివేసిన రోజే తమిళ సర్కార్ కూడా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
హోటళ్లు, రెస్టారెంట్లు కేవలం 50 శాతం కెపాసిటీతో నిర్వహించుకునేలా ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలాగే వివాహాది శుభకార్యాల్లో వంద మందికి, అంత్యక్రియల్లో 50 మందికి మించకూడదని నిబంధనలు విధించింది. టెక్స్‌టైల్, జ్యువెలరీ షాపుల్లో 50 శాతం మంది మించకూడదని తెలిపింది. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
కరోనా కేసుల విషయానికొస్తే.. గురువారం (జనవరి 27) తమిళనాడులో 28,512 కరోనా కేసులు (Covid 19 Cases) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 32,52,751కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో చెన్నైలో 5591 కేసులు, చెంగల్‌పట్టులో 1696, కోయంబత్తూరులో 3629, ఈరోడ్‌లో 1314 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు 19.9శాతంగా ఉంది.
Also Read: Shweta Tiwari: దేవుడు నా 'బ్రా' కొలతలు తీసుకుంటున్నాడు.. నటి వివాదాస్పద వ్యాఖ్యలు
Also Read : Anupama Hot Photos: అనుపమ అందం చూస్తే మతి పోవాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook