Stone Attack On CM YS Jagan In Vijayawada Public Meeting: ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం జగన్ పై కొందరు ఆకతాయిలు రాళ్లతో బలంగా  కొట్టారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా సీఎం జగన్ ఈరోజు విజయవాడలో పర్యటిస్తున్నారు. విజయవాడ సింగ్ నగర్ లో బస్సుమీదఅభివానం చేస్తుండగా.. ఒక్కసారిగా ఎవరో ఆకతాయిలు బలంగా ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో ఒక్కసారిగా అది సీఎం జగన్ కు ఎడమ కంటికి బలంగా తాకింది. వెంటనే ఆయన నొప్పిని తాళలేక తన చేతితో పట్టకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయన పక్కనున్న వెల్లంపల్లికి కూడా మరో రాయి తగిలినట్లు తెలుస్తోంది. వెంటనే సెక్యురిటీ సిబ్బంది సీఎం జగన్ ను బస్సులోపలికి చికిత్స చేసి ట్రీట్మెంట్ అందించారు.  కాగా సీఎం జగన్ బస్సు యాత్ర నాలుగు గంటలుగా జరుగుతున్నట్లు తెలుస్తొంది. దాడి జరిగిన ప్రదేశానికి దగ్గరలోనే బొండా ఉమా, టీడీపీ కార్యలయం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు దాడి చేసిన ఆగంతుకుడిని పట్టుకునే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగ.. సీఎం జగన్ పై కదిరిలో కూడా గుర్తు తెలియని వ్యక్తులో చెప్పులతో దాడి చేసిన విషయం తెలిసిందే.


Read More: Sonu Sood: షూ చోరీ చేసిన స్విగ్గీ డెలీవరీ బాయ్ కు సోనూసూద్ అండ.. కొత్త బూట్లు కొనివ్వండంటూ ట్వీట్..


ప్రస్తుతం సీఎం జగన్ కు మాత్రం కంటి మీద బలంగా గాయమైనట్లు తెలుస్తోంది. సీఎం వ్యక్తి గత వైద్యులు ఆయనకు బస్సులో స్పెషల్ గా ట్రీట్మెంట్ అందించారు. కన్ను పై భాగంలో క్లీన్ చేసి, ఆతర్వాత ప్లాస్టర్ పెట్టారు. రాయిదెబ్బ కంటికి తగిలుంటే కన్నుకు పెద్దప్రమాదమే జరిగి ఉండేదని అందరు భావిస్తున్నారు. సీఎంజగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణచూసి ఓర్వలేక టీడీపీ ఇలాంటి దిగజారుడు పనులు చేస్తుందంటూ కూడా వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.  ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేవుడి చల్లని దీవెన, ప్రజల ఆశీర్వాదాలు ఉన్నంత కాలం ఎవరెన్ని కుట్రలు చేసిన కూడా సీఎం జగన్ కు ఏంకాదని, వైసీపీ నేతలు అంటున్నారు. అదే విధంగా..  మరోసారి వైఎస్సార్సీపీ భారీ మెజారిటీతో గెలవడంఖాయమని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter