Sonu Sood Supports Swiggy Delivery Boy Who Theft Shoes In Haryana: హర్యానాలో లోని గురుగ్రామ్ లో ఫుడ్ ఆర్డర్ డెలీవరీకి వచ్చి ఒక వ్యక్తి షూస్ ను దొంగిలించాడు. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దీన్ని సదరు బాధితులు.. ఆర్డర్ ఇవ్వడానికి వచ్చి డెలీవరీ బాయ్ ఇలా చోరీ చేశాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అది వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. తాజాగా, దీనిపై నటుడు సోనుసూద్ స్పందించారు. సదరు డెలీవరీ బాయ్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దంటూ అభ్యర్థించారు. అతను తనకు అవసరమై చోరీ చేసి ఉండోచ్చు.. పాపం.. డెలీవరీ బాయ్ లు పగలనక రాత్రనక ఫుడ్ ను డెలీవరీ చేస్తుంటారు. ఆ సమయంలో ఎంతో వ్యయప్రయాసలకు లోనౌతుంటారు. అంత మాత్రానికి వారు దొంగలు,చోరీలు చేయడమే వారిపనిగా ఆపాదించలేమన్నారు. కొందరు రోడ్డుమీద ఆకలేసి కొన్నిసందర్భాలలో తినడానికి తిండిలేక, డబ్బులు లేక కొన్నిసార్లు చోరీలుచేస్తారు.
If Swiggy’s delivery boy stole a pair of shoes while delivering food at someone’s house. Don’t take any action against him. In fact buy him a new pair of shoes. He might be really in need. Be kind ❤️🙏
— sonu sood (@SonuSood) April 12, 2024
అంతమాత్రానికి వారు దొంగలు కాదన్నారు. సదరు స్విగ్గీ డెలీవరీ బాయ్ కు మంచి షూస్ కొనివ్వాలని ట్విట్ చేశారు. ఇదిలా ఉండగా.. సోను సూద్ సదరు చోరీ చేసిన వ్యక్తికి సపోర్ట్ చేయడం పట్ల కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చోరీలు చేయడం తప్పుకాదా.. అంటూ కౌంటర్ గా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు కావాలని చోరీ చేయలేదేమో.. డబ్బులులేక ఇలా చోరీ చేయాల్సి వచ్చిందేమో అంటూ కూడా సోనును సమర్థిస్తున్నారు.
ఇక.. సోనుసూద్ కరోనా మహమ్మారి సమయంలో ఎందరో అభాగ్యులను ఆదుకున్నారు. డబ్బులు లేక తమ గ్రామానికి వెళ్లలేని వారి కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి మరీ పంపించాడు. అంతేకాకుండా.. కోవిడ్ సమయంలో ఎందరికో ఆస్పత్రి బిల్లులు, ఆకలితో ఉన్న వారికి ఫుడ్, మెడిసిన్, కోవిడ్ కిట్ వంటి అనేక రకాలుగా సహయం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కరోనా బాధితులు సోనుసూద్ ను ఒక రియల్ హీరోగా కొలుచుకున్నారు.
అసలు స్టోరీ ఇదే..
హర్యానాలోని గురుగ్రామ్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. స్థానికంగా ఒక యువతి స్విగ్గీలో ఆర్డర్ పెట్టింది. అతను ఆర్డర్ పార్శీల్ తీసుకుని ఆ అపార్ట్ మెంట్ చేరుకున్నాడు. అతను రావడంతోనే చుట్టుపక్కల ఉన్నవాటిని దొంగచూపులతో చూస్తున్నాడు. పార్శీల్ ఇవ్వాల్సిన ఇంటి డోర్ బెల్ ను మోగించాడు. కాసేపటికి ఒక యువతి వచ్చి పార్శీల్ తీసుకుంది. కానీ అప్పటికే అతగాడి కళ్లు అక్కడున్న షూస్ మీద పడ్డాయి. యువతి లోపలకు వెళ్లిపోయేవరకు ఏదో ఫోన్ లో చూస్తున్నట్లు నటించాడు.
ఆ తర్వాత వెంటనే ఒక టవల్ తీసుకున్నాడు. అక్కడున్న షూస్ మీద వేసి, వాటిని చుట్టేసి లోపల పెట్టుకున్నాడు.అక్కడి నుంచి మెల్లగా బైటకు జారుకున్నాడు. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దీనిపై సదరు కస్టమర్ స్విగ్గీ డెలీవరీ సంస్థకు ఫిర్యాదు చేశాడు.కానీ కంపెనీనుంచి ప్రాపర్ గా రెస్పాన్స్ రాకపోవడంతో సదరు బాధితులు.. ఈ ఘటనకు చెందిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter