Temple Covid Care Centres: కరోనా రోగుల కోసం ఏపీ ప్రభుత్వం మరిన్ని ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్ మహమ్మారి నేపధ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దేవాలయాల్లో  కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. మొత్తం వేయి పడకలు సిద్ధమయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి (Corona Pandemic) రోజురోజుకూ విజృంభిస్తోంది. కేసుల సంఖ్యపెరిగే కొద్దీ బెడ్స్, ఆక్సిజన్, ఎమర్జెన్సీ మందుల కొరత తీవ్రమవుతోంది. ఈ నేపధ్యంలో కరోనా రోగులకు మరింత విస్తృతమైన వైద్యసేవందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో కోవిడ్ కేర్ సెంటర్లు (Covid Care Centres) ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెద్ద ఆలయాల ఆధ్వర్యంలో వేయి పడకలతో కోవిడ్ కేర్ సెంటర్లు సిద్ధం చేసింది దేవాదాయ శాఖ. చిన్న సెంటర్లలో 25 బెడ్స్, మిగిలిన చోట వంద బెడ్స్ వరకూ ఏర్పాటు చేశారు. ప్రతి కోవిడ్ సెంటర్లోనూ ఆక్సిజన్ బెడ్స్ 3-4 ఉన్నాయి.


వైద్యుల పర్యవేక్షణలో కోవిడ్ కేర్ సెంటర్లలో రోగులకు ప్రాథమిక చికిత్స అందుతుంది. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం ఆలయం, పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయంలలో ఇప్పటికే వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. ఇక శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి ఆలయం, విశాఖ జిల్లా సింహాచలం, గుంటూరు జిల్లా పెదకాకాని, ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఆంజనేయస్వామి ఆలయం, నెల్లూరు జిల్లా జొన్నవాడ ఆలయం, కర్నూలు జిల్లా శ్రీశైలం మహానంది ఆలయం,  కడప జిల్లాలో గండి, అనంతపురం జిల్లాలో కసాపురం, చిత్తూరు జిల్లాలో కాణిపాకంలలో కోవిడ్ కేర్ సెంటర్లు(Covid Care Centres) ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి.


Also read: Raghurama Krishnam Raju అరెస్ట్‌పై తీవ్రంగా స్పందించిన Nara Lokesh


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook