AP Government: రాష్ట్రంలో ఎన్నికల సమయం కావడంతో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను ఈసారి త్వరగా నిర్వహించింది. ఇంటర్ పరీక్షలను మార్చ్ 1 నుంచి 15 వరకూ నిర్వహించగా, పదో తరగతి పరీక్షలు మార్చ్ 18 నుంచి 30వ తేదీ వరకూ జరిగాయి. ఇప్పుడిక వాల్యుయేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తి కావస్తుండటంతో ఫలితాల విడుదలకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో ఓ వైపు అసెంబ్లీ, మరోవైపు లోక్‌సభ ఎన్నికలుండటంతో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను త్వరగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది ఏపీ విద్యాశాఖ. ఎన్నికల నేపధ్యంలో విద్యార్ధులపై ఒత్తిడి లేకుండా ఉండేందుకు ఇప్పటికే పదో తరగతి, ఇంటర్ పరీక్షలను పూర్తి చేసింది. ఇక ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ కూడా మార్చ్ 18న ప్రారంభమై ఇవాళ్టితో ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 9,99,698 మంది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్ష పత్రాల మూల్యాంకనం కోసం 23 వేలమందిని నియమించారు. పరీక్ష పత్రాల పున పరిశీలన, మార్కుల నమోదు ప్రక్రియను త్వరగా ముగించి ఏప్రిల్ 10-12 తేదీల్లో ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గత ఏడాది ఇంటర్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 26న వెల్లడయ్యాయి. 


ఇక పదో తరగతి పరీక్షలు ఏపీలో మార్చ్ 18 నుంచి 30 వరకూ జరిగాయి. మొత్తం 6 లక్షల 30 వేల 633 మంది పరీక్షలు రాశారు. 25 వేలమందితో వాల్యుయేషన్ ప్రక్రియ ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభించారు. 8వ తేదీకు పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం పూర్తి కానుంది. మిగిలిన ప్రక్రియ కూడా పూర్తి చేసి వారం, పది రోజుల్లో అంటే ఏప్రిల్ 15-18 తేదీల్లో ఫలితాలు వెల్లడించవచ్చు. గత ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాలు మే 6న విడుదలయ్యాయి. పరీక్ష ఫలితాలు వెల్లడించాక పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ లేదా బెటర్‌మెంట్ షెడ్యూల్ ఉంటుంది. 


Also read: Glass Symbol: కూటమి కొంప ముంచనున్న గాజు గ్లాసు, ఈసీని ఆశ్రయించనున్న జనసేన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook