AP TET 2024 Key: ఏపీ టెట్ అభ్యర్ధులకు శుభవార్త, ప్రైమరీ కీ విడుదల, ఫలితాలు నవంబర్ 2నే
AP TET 2024 Key: ఆంధ్రప్రదేశ్ టెట్ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్. ఇటీవల జరిగిన టెట్ పరీక్షల ప్రాధమిక కీ విడుదలైంది. ముందుగా ప్రకటించినట్టే నవంబర్ 2న ఫలితాలు విడుదల కానున్నాయి. టెట్ ప్రాధమిక కీను https://aptet.apcfss.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
AP TET 2024 Key: ఆంధ్రప్రదేశ్‌లో టెట్ 2024 పరీక్షలు ముగిశాయి. అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకూ ఈ పరీక్షలు పూర్తయ్యాయి. అన్ని అంశాలకు సంబంధించిన ఈ పరీక్షలకు సంబంధించిన టెట్ పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఇవి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ 3వ తేదీన విడుదల కానుంది. అంతకంటే ముందు నవంబర్ 2న ఇటీవల జరిగిన టెట్ పరీక్షల ఫలితాలు విడుదలవుతున్నాయి. రాష్ట్రంలో అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 21 వరకూ జరిగిన అన్ని అంశాల టెట్ పరీక్షల ప్రాధమిక కీను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌లో ఈ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. పేపర్ 2ఏ, సోషల్ పేపర్, 2 బీ పరీక్ష ప్రిలిమినరీ కీలో ఏమైనా అభ్యంతరాలుంటే అక్టోబర్ 25 వరకూ ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. మిగిలిన పేపర్లపై అభ్యంతరాల స్వీకరణ పూర్తయింది.
ఏపీ టెట్ పరీక్షకు మొత్తం 4,27,30 మంది అభ్యర్ధులు దాఖలు చేసుకోగా రోజుకు రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరిగాయి. ఉదయం 9.30 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మద్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పరీక్షలు కొనసాగాయి. అక్టోబర్ 27వ తేదీన ఫైనల్ కీ విడుదల కానుంది. ఆ తరువాత నవంబర్ 2వ తేదీన టెట్ తుది ఫలితాలు విడుదలవుతాయి.
ఏపీ టెట్ పరీక్ష కీ చెక్ చేసేందుకు ముందుగా https://aptet.apcfss.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఇందులో కన్పించే Question Papers & Keys ఆప్షన్ క్లిక్ చేయాలి. స్క్రీన్‌పై కన్పించే టెట్ పరీక్ష పత్రం, సమాధాన పత్రాలను డౌన్‌లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. మొత్తం 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది.
Also read: Amaravati New Railway Line: ఏపీకు కేంద్రం గుడ్‌న్యూస్, అమరావతి కొత్త రైల్వే లైనుకు గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి