YS Sharmila: ఏపీసీసీ చీఫ్ షర్మిల రెడ్డి అరెస్టు.. కాంగ్రెస్ చలో సచివాలయం కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తత..
Andhra Pradesh: చలో సచివాలయం కార్యక్రమం తీవ్ర గందరగోళంగా మారింది. వైఎస్ షర్మిలకు మద్దతుగా వేలాదిగా స్టూడెంట్స్ ఆమె వెంట సచివాలంయంకు వెళ్లి వినతి పత్రం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దీంతో పోలీసులకు, వైఎస్ షర్మిలకు తీవ్ర తోపులాట జరిగింది.
YS Sharmila Arrested By Police: ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మెగా డీఎస్సీ ప్రకటించాలని వేలాది మంది స్టూడెంట్స్ తో నిరసనలు చేపట్టింది. విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి , సచివాలయానికి ర్యాలీగా వైఎస్ షర్మిలా బయల్దేరారు. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొండ వీటి ప్రాంతంలో పోలీసులు వైఎస్ షర్మిల ను అరెస్ట్ చేసి మంగళగిరి పీఎస్ కు తరలించినట్లు తెలుస్తోంది. అంతకు ముందు వైఎస్ షర్మిలా ఏపీ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు.
Read More: Premature Greying Hair: ఖర్చు లేకుండా తెల్లజుట్టును ఇలా నల్లగా మార్చుకోండి!
దివంగత నేత, YSR ఆత్మ క్షోబిస్తుందని, దీనిపై తన తల్లి విజయమ్మ కూడా బాధపడుతుందని వైఎస్ షర్మిలా అన్నారు. వైఎస్సార్ బిడ్డ పోరాటం చేస్తుంది.. నిరుద్యోగుల కోసమే అని పేర్కొన్నారు. సచివాలయం లోకి వెళ్లి వినతి పత్రం ఇవ్వడానికి కూడా ఏపీలో స్వేచ్చ లేదా అంటూ తీవ్ర స్థాయిలో పోలీసులపై మండిపడ్డారు.
జర్నలిస్ట్ లకు కూడా ఏపీలో స్వేచ్చలేని వాతావరణ ఏర్పడింది. సచివాలయంలో వినతి పత్రం ఇద్దామంటే.. కనీసం ఒక్కరూ లేరంట. సీఎం జగన్ మోహన్ సచివాలయానికి రాడు.. మంత్రులు ఉండరు.. అధికారులు కన్పించరు.. వీళ్లకు పాలన చేతకాదు అనడానికి ఇదే నిదర్శమని వైఎస్ షర్మిలా ఎద్దేవా చేశారు.
Read More: Yashika Aannand: ఎద అందాలతో వల వేస్తున్న యాషిక ఆనంద్ .. హాట్ ఫిక్స్ వైరల్
వీళ్లకు ఏది చేతకాదు, ఎందరో బిడ్డలు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం నోటిఫికేషన్ లు ఇవ్వడం చేతకాలేదని దుయ్యబట్టారు. ఒక ఆడబిడ్డ అని చూడకుండా ఈ విధంగా ప్రవర్తించడం పాపమని వైఎస్ షర్మిలా, పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook