AP Heavy Rains Alert: వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు
AP Heavy Rains Alert: పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రమైంది. ఇవాళ ఒడిశా పూరీ సమీపంలో తీరం దాటనుంది. ఫలితంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Heavy Rains Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారి తీవ్రంగా బలపడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ప్రస్తుతం ఉత్తర వాయవ్య దిశగా గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇవాళ సాయంత్రంలోగా పూరీ సమీపంలో దీరం దాటనుంది. ఈ వాయుగుండం ప్రభావం రాష్ట్రంలోని పలు జిల్లాలపై తీవ్రంగానే ఉండవచ్చని ఐఎండీ హెచ్చరించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇవాళ సాయంత్రం వరకు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. దాంతో ఈ జిల్లాల్లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇక విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాల్లో కూడా రెడ్ అలర్ట్ జారీ అయింది. ఇక కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు రేపటి వరకూ కొనసాగనున్నాయి. ఈ రెండు జిల్లాలకు ప్రభుత్వం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక కోస్తాంధ్రలోని ఇతర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చు.
ఇక రేపు అంటే సెప్టెంబర్ 10 వతేదీన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో సైతం భారీ వర్షాలు పడనున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో రానున్న మూడు రోజులు వేటకు వెళ్లవద్దని మత్స్యకారుల్ని హెచ్చరించారు. గంటకు గరిష్టంగా 60-70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇప్పటికే కాకినాడ, విశాఖపట్నం, గంగవరం, భీమిలి, కళింగపట్నం పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటనుండటంతో ఆ రాష్ట్రంలో సెప్టెంబర్ 11 వరకూ అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న 48 గంటల్లో పరిస్థితి మరింత విషమించవచ్చు.
Also read: Schools Holiday: ఏపీలో అతి భారీ వర్షాల హెచ్చరిక, ఈ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.