AP Weather Report: ఏపీలోని ఈ జిల్లాల్లో రేపు భారీ వర్షాలు, పిడుగులు
AP Weather Report: వాతావరణంలో మార్పులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్ జారీ అయింది. ఏపీలో రానున్న రెండ్రోజులు భారీ పిడుగులతో వర్షాలు పడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏయే జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి, వాతావరణం ఎలా ఉండునుందో తెలుసుకుందాం.
AP Weather Report: అరేబియా సముద్రంలో కేరళ నుంచి మరాఠ్వాడా వరకూ ఆవహించి ఉన్న ఉపరితల ద్రోణి ఇప్పుడు దక్షిణ కర్ణాటక, తూర్పు విదర్బ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. దీనికితోడు మరో నాలుగు రోజుల్లో అంటే మే 19న అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఏపీ, యానాంలోని దిగువ ట్రోపో ఆవరణలో నైరుతు గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రానున్న రెండ్రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
వాతావరణంలో వచ్చిన మార్పుతో ఇవాళ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా కన్పిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఇక కొన్ని జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు పడనున్నాయి. ఓ వైపు ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశముంది. ఇవాళ పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, బాపట్ల, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి.
ఇక చిత్తూరు, తిరుపతి, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన మోస్తు వర్షాలు పడనున్నాయి. రేపు అంటే శుక్రవారం మాత్రం చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపరుం, ప్రకాశం, సత్యసాయి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook