AP Heavy Rains: ఏపీకు మళ్లీ భారీ వర్షాల ముప్పు, ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ
AP Heavy Rains: వాయుగుండం నుంచి ఊపిరిపీల్చుకునేలోగా మరో ముప్పు వచ్చి పడనుంది. ఆంధ్రప్రదేశ్‌కు రెండు రోజుల్లో భారీ వర్షాలు చుట్టుముట్టనున్నాయి. రాష్ట్రంలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ముప్పు తుపాను రూపంలో పొంచి ఉంది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడి అది కాస్తా తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.
విజయవాడను అతలాకుతలం చేసిన వాయుగుండం ముప్పు తొలగిందని సంతోషించేలోపు మరో ముప్పు హెచ్చరిస్తోంది. ఈసారి తుపాను రూపంలో మరింత ప్రమాదం ముంచుకురానుంది. ఈ నెల 5వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కాస్తా బలపడి తుపానుగా మారవచ్చని ఐఎండీ వెల్లడించింది. అదే జరిగితే కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు తప్పవు. అల్పపీడనం బలపడేందుకు దోహదపడే రుతుపవన ద్రోణులు ఇప్పటికే ఉన్నందున తుపాను కచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే తుపాను తీవ్ర తుపానుగా మారుతుందా లేదా అనే వివరాలు ఇంకా తెలియలేదు.
అందుకే ముందు జాగ్రత్త చర్యగా వాతావరణ శాఖ ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో ఈ రెండు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఫలితంగా వరద ముంపు మరింత పెరగవచ్చు. ఇక కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
మరో 24-48 గంటలు భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈసారి ఏర్పడే అల్పపీడనం తుపానుగా మారవచ్చనేది ప్రధానమైన అంచనా. ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న క్రమంగా భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి మరింతగా శృతి మించవచ్చు. అందుకే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
Also read: Rain Alert: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షసూచన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.