Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటిన తరువాత  పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇది రానున్న 12 గంటల్లో దక్షిణ ఒడిస్సా, ఛత్తీస్ గడ్, విదర్బ మీదుగా బలహీనపడనుంది. మరోవైపు వాయుగుండానికి అనుబంధంగా రుతు పవన ద్రోణి ఏర్పడింది. ఫలితంగా రానున్న 24 గంటల్లో ఏపీకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పొంచి ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళాఖాతంలో ప్రస్తుతం వాయుగుండం జగ్దల్‌పూ‌‌ర్‌కు పశ్చిమంగా 40 కిలోమీటర్లు, మల్కాన్ గిరికి 50 కిలోమీటర్లు, విశాఖపట్నంకు 170 కిలోమీటర్లు, కళింగపట్నంకు 220 కిలోమీటర్ల దూరంలో  కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా మరో రుతుపవన ద్రోణి ఏర్పింది. ఫలితంగా ఈ నెల 5 వరకూ కోస్తాంధ్రలో భారీ వర్షాలు పొంచి ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. కోస్తా తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. రాష్ట్రంలోని 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా, 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. 


అటు తెలంగాణలో కూడా 8 జిల్లాలకు రెడ్ అలర్ట్, 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అటు హైదరాబాద్‌లో కూడా ఇవాళ మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే నగరమంతా మేఘావృతమైంది. తెలంగాణలోని మీర్ దొడ్డిలో అత్యదికంగా 15.2 సెంటీమీటర్లు, నారాయణపేటలో 13.8 సెంటీమీటర్లు, కామారెడ్డిలో 13 సెంటీమీటర్లు, వర్ధన్నపేటలో 10.7 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. 


Also read: Krishna Floods: ఇంకా వరద ముప్పులోనే విజయవాడ, ఉగ్రరూపం దాలుస్తున్న కృష్ణమ్మ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.