Krishna Floods: ఇంకా వరద ముప్పులోనే విజయవాడ, ఉగ్రరూపం దాలుస్తున్న కృష్ణమ్మ

Krishna Floods: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రుతు పవన శ్రేణి ఇంకా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో బలహీనపడనుంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 2, 2024, 10:31 AM IST
Krishna Floods: ఇంకా వరద ముప్పులోనే విజయవాడ, ఉగ్రరూపం దాలుస్తున్న కృష్ణమ్మ

Krishna Floods: భారీ వర్షాల కారణంగా వరద ముప్పుకు గురైన విజయవాడ ఇంకా తేరుకోలేదు. ఇప్పటికీ విజయవాడలోని చాలా ప్రాంతాలు నీట మునిగి ఉన్నాయి. మరోవైపు కృష్ణా నదికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. వరద మరో 2-3 అడుగులు పెరిగితే రైల్వే ట్రాక్‌పై చేరుకునే అవకాశముంది. 

భారీ వర్షాల కారణంగా విజయవాడ సింగ్‌నగర్ పూర్తిగా నీట మునిగింది. ఏకంగా 7-8 అడుగుల వరద ప్రవహిస్తోంది. బుడమేరు కరకట్ట తెగడంతో వరద భారీగా వచ్చి పడింది. ఇళ్లలోకి 6 అడుగుల నీరు వస్తోంది. సింగ్‌నగర్ ఫ్రై ఓవర్‌పై వరద బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహాయక చర్యలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న కుటుంబసభ్యుల్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విజయవాడ-కొండపల్లి ట్రాక్‌పై భారీగా వరద నీరు చేరింది. హైదరాబాద్‌కు వెళ్లేవారిని, హైదరాబాద్ నుంచి వచ్చేవారిని నల్గొండ-గుంటూరు మీదుగా మళ్లిస్తున్నారు. పాలేరు వాగు ఉధృతికి  రహదారి కోతకు గురైంది. 

విజయవాడ, అమరావతి ప్రాంతాలు వరద ప్రభావంతో అస్తవ్యస్థమయ్యాయి. ఎమ్మెల్యేల నివాస భవనాల్లోకి వరద నీరు చేరుకుంది. జలదిగ్భంధనంలో ఏపీ హైకోర్టు, సచివాలయం, ప్రభుత్వ భవనాలు చిక్కుకున్నాయి. విజయవాడ-హైదరాబాద్ రహదారిపై నందిగామ వద్ద భారీగా వరద ప్రవహిస్తోంది. 

కృష్ణా నది ఉగ్రరూపం దాల్చడంతో అవనిగడ్డలో వరద నీరు వచ్చి చేరుతోంది. పులిగడ్డ ఆక్విడెక్ట్ పూర్తిగా నీట మునిగింది. దివిసీమలో పంట పొలాలు నీట మునిగాయి. సింగ్‌నగర్, ప్రకాశ్ నగర్, ఖండ్రిగ, పైపుల రోడ్, న్యూ రాజరాజేశ్వరి పేట, వైఎస్సార్ కాలనీ, జక్కంపూడి కాలనీ, వాంబే కాలనీలు ఇకా వరద ముప్పులోనే ఉన్నాయి. 

Also read: New Route: తెలంగాణ-ఏపీకి కొత్త మార్గం.. ఖమ్మం, విజయవాడలకు వెళ్లడం ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News