Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న 3 రోజులు ఏపీలో భారీ వర్షాలు
Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం హెచ్చరిక జారీ అయింది. మరో రెండ్రోజుల్లో ఈ అల్పపీడనం బలపడనుంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains Alert: దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనం ఏర్పడనుంది. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని ఐఎండీ వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా బలపడనుంది. మరో రెండు మూడు రోజుల్లో అల్పపీడనం తీవ్రరూపం దాల్చనుంది. ఆ తరువాత ఈ నెల 18వ తేదీన తమిళనాడులో తీరం దాటవచ్చని అంచనా. ఈ అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి 30-35 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలోని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించారు.
రేపు మంగళవారం నెల్లూరు, తిరుపతి ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇక తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కొనసాగనున్నాయి. ఇక గురు, శుక్ర వారాల్లో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశముంది.
Also read: Low Pressure: నేడు తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాలో వర్షాలు, జాగ్రత్తలు పాటించాలని ఐఎండి అలర్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.