Another Low Pressure: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, మరోవైపు చలి స్థాయిలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు వివిధ ప్రాంతాల్లో పడుతున్నాయి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక హైదరాబాద్‌లో చలి తీవ్రత పెరుగుతుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ఈరోజు తీవ్ర అల్పపీడనంగా మారి ఉంది వాతావరణ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ఈరోజు తీవ్ర అల్పపీడనం గా మారి వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని అని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఈ అల్పపీడనం తమిళనాడులో తీరం దాటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
దీనివల్ల నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు రేపటి నుంచి కోస్తా, రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది. ఈ నేపథ్యంలో మత్స్య కారులు వేటకు వెళ్లకూడదని వరి కోతకు వెళ్లే రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల వల్ల ఇప్పటికే ఏపీ, తమిళనాడులోని పలు ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా తమిళనాడులో భారీ వర్షాల వల్ల కారులో సైతం బ్రిజ్‌పై పార్కింగ్ చేసే పరిస్థితికి దారితీసింది. అప్పట్లో ఆ దృశ్యాలు బాగా వైరల్ అయ్యాయి.
మొన్నటి వరకు తిరుపతిలో కూడా భారీ వర్షాలు కురిశాయి. మాడవీధుల తడిసి ముద్దాయి. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు మరోసారి బలపడనుంది. దీనివల్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
మరోవైపు ఈ ప్రభావం వల్ల తెలంగాణలో కూడా చలి స్థాయిలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరుగుతోంది, పొగ మంచు కమ్ముకుంటుంది. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళలో ప్రయాణాలు చేసే వాహనదారులు అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ హచ్చరించింది.