AP Rains Alert: తీవ్ర అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాలు
AP Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ఫలితంగా ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో మాత్రం వర్షసూచన లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Rains Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడనం రేపటికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక-తమిళనాడు తీరం వైపుకు కదలనుంది. రానున్న రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఇవాళ నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరూ, తిరుపతి జిల్లాల్లో రేపు భారీ వర్షాలు పడనున్నాయి. ఇక బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చు. పంట కోతల సమయంలో భారీ వర్షాల కారణంగా అన్నదాతలకు హెచ్చరికలు జారీ చేశారు. పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇక తెలంగాణకు మాత్రం ఎలాంటి వర్షసూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని సూచించింది. పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు. డిసెంబర్ 15న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఫలితంగా డిసెంబర్ 15 నుంచి మరో 4-5 రోజులు భారీ వర్షాలు పడనున్నాయి.
Also read: Supreme Court On Freebies: ఇంకెంత కాలం ఉచితాలిస్తారు, సుప్రీంకోర్టు మండిపాటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి