AP Rains: ఏపీకి అతి భారీ వర్ష సూచన..
AP Rains: బంగాళాఖాతంలో ఏన్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం రేపటికి అల్ప పీడనంగా మారనుంది.
AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఏపీకి భారీ వర్షాలు కురువనున్నాయి. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం
మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల సూచన చేశారు. ఇది రాబోయే 12 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశాలున్నాయి.
రేపు బాపట్ల,కర్నూలు, ప్రకాశం, నెల్లూరు,నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అటు విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచింది. పశ్చిమ గోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం మరో మూడు నాలుగు రోజుల పాటు కొనసాగనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురవునున్నాయి. ఇప్పటికే కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో రాత్రి నుంచి వర్షం పడుతోంది. 3రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!
ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో వచ్చే నాలుగు రోజులు ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. రేపటికి ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఇప్పటికే వర్షాలతో అతలాకుతలమైన ఏపీలోని పలు జిల్లాలు తాజాగా జారీ చేసిన వర్ష సూచనతో ముంపు ప్రాంతాల ప్రజలు కంటి మీద కునుకు లేకుండా బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మొత్తంగా ఈ సారి కురిసే వర్షాలు బుడమేరు తరహా ఘటనలకు పునరావృతం కాకుండా అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఏది ఏమైనా ప్రకృతి విపత్తులు సంభవిస్తే దాన్ని ఎలాగో తప్పించలేము. ఉన్నంతలో తక్కువ నష్టంతో బయటపడొచ్చు.
భారీ వర్షాల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాలు అలర్ట్ గా ఉండాలని ఏపీ సర్కారు సూచించింది. వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు స్పెషల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏదైనా అనుకోని విపత్తు సంభవిస్తే వెంటనే రంగంలోకి దిగడానికి స్పెషల్ స్వ్కాడ్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు 24/7 అలర్ట్‌గా ఉండాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter