Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

Tollywood Celebrities Guinnis Records:  తాజాగా చిరంజీవి పేరు మరోసారి మారు మ్రోగిపోయింది. తన 46 కెరీర్ లో దాదాపు 156 చిత్రాల్లో 537 పాటల్లో 24వేలకు స్టెప్స్ వేసి అలరించినందకు గాను చిరంజీవి పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు ఎక్కింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈయన కంటే ముందు గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించుకున్న ప్రముఖులు ఎవరున్నారో చూద్దాం..

1 /10

చిరంజీవి - తాజాగా చిరంజీవి ఖాతాలో మరో రికార్డు చేరింది. దాదాపు తన 46 యేళ్ల కెరీర్ లో 156 సినిమాల్లో 537 సాంగ్స్ లో 24 వేలకు స్టెప్పులు వేసారు. ప్రపంచ సినీ చరిత్రలో ఇన్ని సినిమాల్లో వేర్వేరు స్టెప్పులతో అలరించినందుకు గాను మెగాస్టార్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయిలా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వచ్చి చేరింది.  

2 /10

బ్రహ్మానందం.. తక్కువ సమయంలో వెయ్యికి పైగా సినిమాల్లో నటించినందకు గాను బ్రహ్మానందం పేరు 2010లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చేరింది.

3 /10

దాసరి నారాయణ రావు.. ప్రపంచంలో ఎక్కువగా చిత్రాలను డైరెక్ట్ చేసిన దర్శకుడిగా దాసరి నారాయణ రావు పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. భారత దేశ చలన చిత్ర పరిశ్రమలో తెలుగు, హిందీ, తమిళం సహా 151 సినిమాలను  డైరెక్ట్ చేసారు.

4 /10

డి.రామానాయుడు - భారత దేశంలో  కరెన్సీ నోటుపై ఉన్నఅన్ని భాషలతో కలిపి దాదాపు 13 పైగా భాషల్లో దాదాపు 150 పైగా చిత్రాలను నిర్మించిన నిర్మాతగా 2008లో డి.రామానాయుడు పేరుli గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది.

5 /10

విజయ నిర్మల - విజయ నిర్మల ప్రపంచంలో తెలుగు, తమిళం, మలయాళం సహా  42 చిత్రాలను  డైరెక్ట్ చేసిన ఏకైక లేడీ దర్శకురాలిగా 2000లో గిన్నీస్ బుక్ లో రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు.

6 /10

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం - దాదాపు 53 యేళ్ల పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం సహా పలు భాషల్లో గాయకుడిగ 40 వేలకు పైగా పాటలు పాడిన పాడగాడిగా 2001లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు ఈ లెజండరీ గాయకుడికి చోటు దక్కింది. జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా ఆరు జాతీయ అవార్డులతో పాటు తెలుగులో అక్కినేని తర్వాత మూడు పద్మ అవార్డులు అందుకున్న తెలుగు వాడు బాలు కావడమే విశేషం.

7 /10

ఎన్టీఆర్ - ఎన్టీఆర్ 29 మార్చి 1982న తెలుగు దేశం పార్టీ పార్టీ స్థాపించి 1983 జనవరి 9న  తొమ్మిది నెలల వ్యవధిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాజకీయ నటుడిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఈ పేరు ఎక్కింది. అంతేకాదు తెలుగులో ఎక్కువ 100 రోజుల చిత్రాల్లో హీరోగా నటించిన కథానాయకుడి కూడా ఈయన పేరిట రికార్డు ఉంది.

8 /10

రామోజీ రావు - రామోజీ రావు ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీని స్థాపించిన నేపథ్యంలో ఈయన పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది.

9 /10

పి. సుశీల - తెలుగు సహా దక్షిణాది భాషల్లో తన గాత్రంతో అలరించిన గాయని పి.సుశీల. దాదాపు 18 వేలకు పాటలు పాడిన లేడీ సింగర్ గా ఈమె పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. అందులో తన జూనియర్ అయిన బాలుతోనే సుశీల 1336 డ్యూయట్స్ సాంగ్స్ పాటడం విశేషం.

10 /10

గజల్ శ్రీనివాస్.. గజల్ శ్రీనివాస్ 100 భాషల్లో 100 గజల్స్ పాడిన పాటగాడిగా 2008లో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు సంపాదించుకున్నాడు. ఈయన జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘విచిత్రం’ మూవీతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు.