Temperature in AP: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలతోపాటు ఎండలు కూడా భారీ స్థాయిలో ఉండనున్నాయి. కొన్ని జిల్లాలకు వర్ష సూచన ఉంటే.. మరికొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీయనున్నాయి.  సోమవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ, పార్వతీపురం మండలాల్లో, వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం, ప్రొద్దుటూరు, వీరపనాయునిపల్లె, ఎర్రగుంట్ల మండలాల్లో, విజయనగరం జిల్లాలోని గజపతినగరం మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బీఆర్ అంబేద్కర్ తెలిపారు. మిగిలిన చోట్ల  ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఆదివారం వైఎస్సార్  జిల్లాలో ఆరు మండలాలు, నంద్యాల జిల్లాలో ఒక మండలంలో వడగాల్పులు వీచాయని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా చాగలమర్రిలో 43.8°C, నెల్లూరు జిల్లా సీతారామపురంలో  43.5°C, వైఎస్సార్ జిల్లా చక్రాయపేటలో 43.3°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. 


మరోవైపు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు మరాఠ్వాడా, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుందని అంబేద్కర్ తెలిపారు. దీని ప్రభావంతో సోమవారం శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి, వైఎస్ఆర్, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మంగళవారం అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. మన్యం, విజయనగరం, విశాఖపట్నం, కోనసీమ, కృష్ణా, వైఎస్ఆర్, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండరాదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.


Also Read: Kishan Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై కిషన్ రెడ్డి క్లారిటీ..!  


Also Read: Chennai Super Kings: ప్లేఆఫ్స్‌కు ముందు చెన్నై షాక్.. స్టార్ ప్లేయర్ దూరం..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook