Mla adimulam romance video: ఆంధ్ర ప్రదేశ్ లో కొన్నిరోజులుగా పలుపార్టీలకు చెందిన నేతలు మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. గతంలో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.. ఒక మహిళతో న్యూడ్ గా మాట్లాడిన వీడియో  కలకలంగా మారింది.  దీనిపై పెద్ద రచ్చే జరిగింది. అయితే.. ఇది ఫెక్ వీడియో అని గోరంట్ల మాధవ్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు సైతం.. వీడియో కాల్స్ లో అసభ్యంగా మాట్లాడినట్లు వీడియో కూడా సోషల్ మీడియాలో రచ్చ గా మారింది. ఈ క్రమంలో.. తాజాగా,  సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఒక మహిళ లైంగిక వేధింపులు ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.



పూర్తి వివరాలు.. 


సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధించాడని కూడా .. బాధితురాలు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో తన బాధను చెప్పుకుంది. తన భర్తతో కలిసి ఈ రోజు హైదరాబాద్ లో మీడియా  సమావేశంలో తనపై జరిగిన దారుణాన్ని చెప్పుకుంది. తిరుపతిలోని బీమాస్ హోటల్‌లో తనపై లైంగిక దాడి చేశాడని బాధితురాలు చెప్పుకొచ్చింది.ఒకే పార్టీకి చెందినవారు కావడంతో.. తనక పదే పదే కాల్స్ చేసేవాడని, చెల్లె అని అంటూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని కూడా చెప్పుకొచ్చింది.


తిరుపతిలోని భీమాస్ హోటల్‌లోని రూమ్ నెంబర్ 109 లోకి పిలిచాడని చెప్పాడని తెలిపింది. అక్కడ తనను బెదిరించి తనపై ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు చెప్పింది. ఎవరికైనా చెబితే తనతో పాటు కుటుంబాన్ని చంపేస్తానని హెచ్చరించాడని తెలిపింది. ఇప్పటి వరకు మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది.


చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజరూపాన్ని బట్టబయలు చేయడానికి పెన్ కెమెరా పెట్టినట్లు తెలిపింది. లైంగికంగా తన కోరిక తీర్చకుంటే.. కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే బెదిరించాడని బాధితురాలు వెల్లడించింది. ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లకు చెప్పినట్లు కూడా మహిళ చెప్పింది. ఈ ఘటన ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. దీనిపై ఇప్పుడు రాజకీయాల్లో రచ్చగా మారింది.


ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే ఆదిమూలం..


మరోవైపు ఈ ఘటనపై ఎమ్మెల్యే ఆదిమూలం స్పందించారు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగా తనను ఈ ఘటనలో ఇరికించారని, దీనికి తనకు ఎలాంటి సంబంధంలేదంటూ కూడా స్పష్టం చేశాడు.తన ఎలాంటి వాడినో.. నియోజకవర్గాల ప్రజలకు, సీఎం చంద్రబాబుకు తెలుసని కూడా చెప్పుకొచ్చారు.  


Read more: GYM Workouts on Saree: చీరకట్టులో మహిళల వర్కౌట్స్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..


ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఏపీలో వరదల నేపథ్యంలొ.. ఈ ఘటన మాత్రం రాజకీయంగా రచ్చగా మారింది. దీనిపై ఏపీ వ్యాప్తంగా  కూడా పలువురు రాజకీయ నేతలు మాత్రం సీరియస్ గా స్పందిస్తున్నారు. వదరసహాయకచర్యలలో బిజీగా ఉన్న ప్రభుత్వం దీనిపై ఎలా రియాక్డ్ అవుతుందో మాత్రం తెలియాల్సి ఉంది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.