ఆంధ్రప్రదేశ్‌లోని 12,918 పంచాయితీల్లో 2,54,30,292 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ల నివేదికలు చెప్తున్నాయి. వీరిలో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఉన్నారు. 1.27కోట్ల మంది మహిళలు,1.26కోట్ల మంది పురుషులు, 1367 ఇతరులుగా పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 30.02 లక్షల ఓటర్లుంటే గుంటూరు, పశ్చిమ గోదావరి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.  13.28 లక్షల ఓటర్లతో కడప, 13.80 లక్షల ఓటర్లతో విజయనగరం చివరి స్థానాల్లో నిలిచాయి.  శ్రీకాకుళం జిల్లాలో 13.26 లక్షల ఓటర్లను కలిగి ఉండి జాబితాలో చివరి స్థానంలో నిలిచింది.


ఆగస్టుతో పంచాయితీ సర్పంచుల పదవీకాలం ముగియనుండటంతో తదుపరి ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం ముందస్తు కసరత్తును ప్రారంభించింది. ఈ క్రమంలో కలెక్టర్లు జిల్లాల వారీగా పంచాయతీ ఓటర్ల తుది జాబితాలను ప్రకటించారు. హడావుడిగా చేసిన ఈ ప్రక్రియతో అనేక జిల్లాల్లో ఓటర్ల జాబితాలలో పొరపాట్లు దొర్లినట్లు ఆరోపణలున్నాయి. ఒకరికి బదులు మరొకరు ఫొటో ఉండటం, పేర్లు తప్పుగా రావడం, చిరునామా వంటి తప్పులు చోటుచేసుకున్నాయి.  అయితే వీటిపై ప్రభుత్వం అధికారిక చేయాల్సి ఉంది.