YSRCP leader D Revathi slaps a toll plaza staff: అమరావతి: నా కారే ఆపుతారా..? నన్నే టోల్ ఫీజు అడుగుతారా..? ఎంత ధైర్యం.. నేను ఎవరనుకుంటున్నారు.. అంటూ రెచ్చిపోయారు ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్‌పర్సన్ (ap vaddera corporation chairman) దేవెళ్ల రేవతి. గుంటూరు జిల్లా కాజా టోల్‌గేట్ వద్ద టోల్ సిబ్బంది తన కారుకు బారికేడ్లు అడ్డుపెట్టడంపై ఆమె ( Devella Revathi) నానా హంగామా చేసి వారిపై చేయి కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక ప్రజాప్రతినిధి అయివుండి ఇలా చేయడమేంటని ఈ ఘటనపై అందరూ విస్మయం వ్యక్తంచేస్తున్నారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాజా టోల్‌గేట్ (Kaja Toll) వద్ద గురువారం టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్తున్న ( Andhra Pradesh ) అధికార పార్టీ వైస్ఆర్‌సీపీ ( Ysrcp ) నాయకురాలు, వడ్డెర కార్పొరేషన్ చైర్‌పర్సన్ రేవతి కారుకు టోల్‌గేట్ సిబ్బంది బారికేడ్లు అడ్డుపెట్టారు. దీంతోపాటు కోపంతో కారు దిగిన రేవతి టోల్‌గేటు సిబ్బందిని దూషిస్తూ.. బారికేడ్‌ను పక్కకు నెట్టి సిబ్బందిపై చేయి కూడా చేసుకున్నారు. రేవతి హాడావిడితో అక్కడున్న వారంతా నివ్వెరపోయారు. టోల్ ఫీజు నుంచి ఆమెకు మినహాయింపు లేకపోయినప్పటికీ.. ఆమె ఇంత హంగామా చేశారని టోల్‌గేట్ సిబ్బంది తెలిపారు. అనంతరం ఆమె విజయవాడ వైపు వెళ్లారు.  Also read: Telangana: టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డిపై అట్రాసిటీ కేసు


దీంతో దేవళ్ల రేవతిపై కాజా టోల్​గేట్ సిబ్బంది మంగళగిరి (Mangalagiri) రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఛైర్‌పర్సన్‌ తమపై దాడి చేసి దూషించారని పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతోపాటు ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను కూడా వారు పోలీసులకు అందజేశారు. ప్రస్తుతం దేవళ్ల రేవతి హంగామాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also read; Andhra Pradesh: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం: ముగ్గురు మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook