AP: భారత్ మిషన్ ప్రధానమంత్రి అవార్డు రేసులో విశాఖ
స్వచ్ఛ సర్వేక్షణ్ లో టాప్ 10 లో నిలిచిన విశాఖపట్టణం ఇప్పుడు మరో అవార్డు కోసం రేసులో నిలిచింది. ఈసారి స్వచ్ఛ భారత్ మిషన్ ప్రధానమంత్రి అవార్డు కోసం పోటీ పడుతోంది.
స్వచ్ఛ సర్వేక్షణ్ ( Swachh sarvekshan ) లో టాప్ 10 లో నిలిచిన విశాఖపట్టణం ( Visakhapatnam ) ఇప్పుడు మరో అవార్డు కోసం రేసులో నిలిచింది. ఈసారి స్వచ్ఛ భారత్ మిషన్ ప్రధానమంత్రి అవార్డు కోసం పోటీ పడుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖపట్టణం. ఇటీవలే స్వచ్ఛ సర్వేక్షణ్ లో 14 స్థానాలు దాటుకుని టాప్ 10 లో నిలిచింది. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక అవార్డు కోసం పోటీలో ఉంది. స్వచ్ఛ భారత్ మిషన్ ( Bharat mission ) ఆద్వర్యాన దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి అవార్డు ( prime minister award ) నిర్వహిస్తుంటారు. దీనికి సంబంధించి 2020 అవార్డు కోసం టాప్ 10 లో స్థానం సంపాదించుకుని అవార్డు రేసులో ఉంది. జిల్లాలోని మూడు పట్టణ స్థానిక సంస్థలు కలిసి ఓ క్లస్టర్ గా పోటీలో పాల్గొన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్నించి ఈ రేసుకు ఎంపికైన జిల్లాగా విశాఖ నగరం చోటు సంపాదించుకుంది. తడిపొడి చెత్త విభజన, చెత్త నుంచి ఎరువు తయారీలో ఇటీవలే విశాఖకు ప్రశంసలు లభించాయి. ఇప్పుడు ప్రధానమంత్రి అవార్డు రేసులో ఉంది. ఈ అవార్డు విశాఖకు లభిస్తే..దేశవ్యాప్తంగా విశాఖ పేరు మార్మోగుతుంది.
వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండటమే కాకుండా పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవడం, చెత్తను తడి, పొడిగా విభజించడం, స్థానిక సంస్థలు అందిస్తున్న సేవలు, వివిధ కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండటం వంటి అంశాల్లో ప్రజల్లో ఎలాంటి అభిప్రాయముందనే విషయాలపై ఈ పోటీ నిర్వహిస్తున్నారు. గ్రేటర్ విశాఖపట్టణం, నర్శీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలు కలిసి ఓ క్లస్టర్ గా ఏర్పడ్డాయి. ఈ అవార్డుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను ప్రధానమంత్రి కార్యాలయాలనికి ( PMO ) జిల్లా కలెక్టర్, జీవిఎంసీ ప్రత్యేక అధికారిగా ఉన్న వినయ్ చంద్ ఆన్ లైన్ లో వివరించారు.
ఈ అవార్డు కోసం దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్నించి పది జిల్లాలు ప్రదానమంత్రి అవార్డు కోసం పోటీ పడుతున్నాయి. ప్రమోటింగ్ పీపుల్స్ మూమెంట్-జన భగీరధి ( promoting people's movement-jan bhagirathi ) పేరుతో అవార్డు అందించనున్నారు. ఏపీ నుంచి విశాఖపట్టణం, ఛత్తీస్ గఢ్ నుంచి దుర్గ్, సుర్గుజా, రాయ్ ఘర్, రాజ్ నంద్ గావూన్ జిల్లాలు, గుజరాత్ నుంచి సూరత్, అహ్మదాబాద్, రాజ్ కోట్ లు, మధ్యప్రదేశ్ నుంచి ఇండోర్, మహారాష్ట్ర నుంచి ధూలే జిల్లాలు రేసులో ఉన్నాయి. దక్షిణాది నుంచి కేవలం విశాఖపట్టణం మాత్రమే పోటీలో ఉండటం విశేషం. దీనికి సంబంధించి తుది ఫలితాలు సెప్టెంబర్ నెలాఖరులో వెల్లడి కానున్నాయి. Also read: AP: 1-8 తరగతుల వరకూ ఇంటి నుంచే విద్య..కొత్తగా మార్గదర్శకాలు జారీ