CM Jagan: సీఎం జగన్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ ప్రతినిధుల సమావేశం
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు హడావిడి పొదలయ్యింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్.. పార్టీ శ్రేణులను ఎన్నికలే లక్ష్యంగా సమాయత్తపరచునున్నారు. ఎన్నికల వేళ పార్టీకి దిశ, దశను ఆయన ఖరారు చేయనున్నారు.
CM Jagan: ఎన్నికల సమరానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం సమాయత్తమతోంది. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పార్టీ శ్రేణులను ఎన్నికలే లక్ష్యంగా సమాయత్తపరచునున్నారు. రేపు పార్టీ వ్యవస్థలో అత్యంత కీలకమైన మండలస్థాయి నాయకులతో నేరుగా సీఎం జగన్ సమావేశం అవుతున్నారు. విజయవాడలో జరిగే ఈ ప్రతినిధులు సభను ఉద్దేశించి సీఎం కీలక ముఖ్యమైన ప్రసంగం చేయనున్నారు. ఎన్నికల వేళ పార్టీకి దిశ, దశను ఆయన ఖరారు చేయనున్నారు. ఇంతంటి ప్రతిష్టాత్మక సమావేశానికి రేపు ఉదయం 9 గంటలకు ఇందిరా గాంధీ స్టేడియంలో మాతో కలిసి మీరు కూడా పాల్గొనండి. రాష్ట్ర స్థాయి నుండి మండల స్థాయి వరకు 8000 మందికి పైగా నాయకులు, ఒక చారిత్రాత్మక సందర్భం కోసం సమావేశమవుతున్నారు
పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్
సీఎం జగన్ దార్శనిక నాయకత్వం, మార్గదర్శకత్వం వైయస్ఆర్సీపీ సందేశాన్ని రాష్ట్రంలో చివరి మైలు వరకు తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో పార్టీ క్యాడర్ తో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా సీఎం జగనే స్వయంగా వైయస్ఆర్సీపీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలంగా ఉండే క్యాడర్‌ను ఉద్దేశించి, రాబోయే ఎన్నికలకు టోన్ సెట్ చేస్తారు.
వైఎస్సార్ సీపీ కొత్త కార్యక్రమాలను (క్యాంపెయిన్లు) ఆవిష్కరణ!
గడపగడపకూ మన ప్రభుత్వం, జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలతో రాష్ట్రంలోని ప్రతి గడప వద్దకూ కదిలిన పార్టీ యంత్రాంగం, ఇప్పుడు కీలక దశలోకి అడుగుపెడుతోంది. రాబోయే ఆరు నెలల్లో పార్టీ మరింత ఉత్సాహంగా పని చేసేందుకు పార్టీ క్యాడర్ లో గ్రామ స్థాయినుంచి నూతనోత్తేజం నిపేందుకు కొత్త ప్రచారాల(క్యాంపెయిన్లు) శ్రేణిని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రం అటు సంక్షేమంలోనూ ఇటు అభివృద్ధిపరంగా సాధించిన విజయాలను ప్రతి ఇంటివద్దకూ చేర్చనుంది.
Also Read: Assembly Elections 2023 Live Updates: తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ఇదే.. ఫలితాలు ఎప్పుడంటే..?
సీఎం జగన్ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? వివిధ రంగాల్లో వచ్చిన కీలక మార్పులను ప్రజలకు తెలియజెప్తూ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ కార్యక్రమంపై మండలస్థాయి నాయకులకు అవగాహన కల్పించడంతోపాటు, దాని ద్వారా పార్టీ యంత్రాంగాన్ని విస్తృతంగా ప్రజల్లోకి పంపించేందుకు వైయస్ జగన్ కార్యాచరణ చేశారు. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం ద్వారా.. ఇటీవల ప్రతిపక్షాలు చేస్తున్న అవాస్తవ ప్రచారాలను తిప్పికొట్టేలా ఇప్పటికే పార్టీ తగిన సరంజామాను సిద్ధంచేసింది. దేశంలో ఏ రాష్ట్రంలో సాధించలేని లక్ష్యాలు, ప్రగతిని ఏపీ ఎలా సాధించిందో వివరించేలా సమగ్రంగా రూపొందించిన కరపత్రాన్నికూడా రేపటి సమావేశంలో ప్రతినిధులకు అదించనున్నారు. సంక్షేమం, వ్యవసాయం, అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, విద్య, వైద్య రంగాల్లో సాధించిన చిరస్మరణీయ విజయాలపై రూపొందించిన మెటీరియల్‌ను ప్రతినిధులకు అందిస్తారు. వీటిని ప్రజలవద్దకు చేరవేసి వారి అభిప్రాయాలతో సంతకాలు కూడా తీసుకుంటారు. తద్వారా ఈ కార్యక్రమాలతో ప్రజలను భాగస్వాములు చేయనున్నారు.
Also Read: Redmi 12 5G Price: అతి తక్కువ REDMI 12 స్మార్ట్ ఫోన్ రూ.2,199కే..నమ్మట్లేదా ఇలా కొనండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి