Assembly Elections 2023 Schedule Live Updates: ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నగరా మోగబోతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ ఏడాది నవంబర్-డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించనుంది. వచ్చే ఏడాది దేశంలో లోక్‌సభ ఎన్నికలతోపాటు మిగిలిన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో వచ్చే ఏడాది కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని తేలే అవకాశం ఉంది. నోటిఫికేషన్ కంటే ముందే కాంగ్రెస్, బీజేపీ మినహా అన్ని ప్రాంతీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెలంగాణ విషయానికి వస్తే.. అధికార బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీ కూడా జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నాయి.