Fishing Ban: `ఉప్పెన` సినిమా పునరావృతం.. ఇకపై సముద్రంలో ఆ `పని` నిషేధం
Fishing Ban For Breeding Season: ఉప్పెన సినిమాలో ఓ సన్నివేశం గుర్తుందా..? ఇప్పుడు అదే సన్నివేశం పునరావృతం కానుంది. ఇకపై సముద్రంలో ఆ పని చేయడం నిషేధం. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు.
Annual Marine Fishing Ban: సముద్రం అనేది ఒక పెద్ద ప్రపంచం. అందులో ఎన్నో జంతురాశులు, వృక్ష జాతులు ఉంటాయి. ఒక్కోటి ఒక్కో ప్రత్యేకం కలదు. సముద్రం గురించి మనకు తెలిసింది కొంతే. తెలియాల్సిన విషయాలు బోలెడు ఉన్నాయి. వాటిలో సముద్రంలో జరిగే ఒక కీలక విషయం 'ఉప్పెన' సినిమా ద్వారా తెలిసింది. సముద్ర తీర ప్రాంతాలకు తెలిసి ఉండవచ్చు. కానీ ప్రజలందరికీ తెలియని విషయం 'చేపలు సంతానోత్పత్తికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో చేపల వేటకు నిషేధం ఉంటుంది' అనే విషయం మాత్రం ఆ సినిమా ద్వారా తెలిసింది. ఇప్పుడు చేపల సంతానోత్పత్తికి సమయం వచ్చేసింది. అంటే సముద్రంలో చేపల నిషేధం అమల్లోకి రానున్నది. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఏప్రిల్ 15వ తేదీ నుంచి చేపల వేట నిషేధంపై ఆంధ్రప్రదేశ్ మత్య్స శాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉందని మత్స్యశాఖ జేడీ విజయకృష్ణ తెలిపారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాదు తీరప్రాంతం విస్తరించి ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ నిషేధం అమలు చేయనున్నారు. తూర్పు తీరంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15వ తేదీ వరకు చేపల వేటపై నిషేధం విధించారు. ఆ సమయంలో చేపల వేటకు మత్య్సకారులు వెళ్లరాదని స్నష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Viral Video: బార్‌లో పెద్దావిడ 'యానిమల్' స్టెప్పులు.. విజిల్స్, కెవ్వు కేకలతో అవ్వ వావ్వా
సముద్రంలో చేప పిల్లలు ఎదిగే సమయం ఇదే. ఇక చేపలు సంతానోత్పత్తిని పొందే సమయం ఇదే కావడంతో ఆ సమయంలో చేపల వేటకు నిషేధం విధించారు. ఒకవేళ ఈ సమయంలో చేపల వేటకు వెళ్తే వాటి సంతానోత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది. దీంతో మత్య్స సంపద తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్-జూన్ మధ్య 61 రోజుల పాటు చేపల వేటను నిషేధిస్తారు. ఈ నిషేధం ద్వారా చేపలు తమ సంతానాన్ని పెంచిపోషిస్తాయి. సంపర్కం కలిగి చేప పిల్లలు పుడతాయి. వాటి ఎదుగుదల కూడా ఉంటుంది. ఈ 61 రోజులు వేటకు వెళ్లకపోతే చాలు సంవత్సరానికి సరిపడా మత్య్స సంపద లభించే అవకాశం ఉంది.
నిషేధం విధించిన సమయంలో ఎవరైనా మత్య్సకారులు వెళ్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. కాగా ఈ 61 రోజులు మత్య్సకారులు తమ వేటకు సంబంధించిన సామగ్రి, వస్తువులను మరమ్మతు చేసుకుంటారు. ముఖ్యంగా పడవలు బాగు చేసుకుంటారు. మరికొందరు విహార యాత్రలకు వెళ్తుంటారు. నిషేధం అమలులో ఉన్న రోజుల్లో మత్య్సకారులు పండుగ చేసుకుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter