Viral Video: బార్‌లో పెద్దావిడ 'యానిమల్‌' స్టెప్పులు.. విజిల్స్‌, కెవ్వు కేకలతో అవ్వ వావ్వా

Old Woman Animal Bobby Deol Dance In Bar:  పెద్దావిడ.. మన బామ్మ వయసు ఉంటుంది. ఆమె బార్‌లో బీర్‌ సీసా నెత్తిన పట్టుకుని 'యానిమల్‌' పాటకు కిర్రాక్‌ స్టెప్పులేసింది. ఆమె డ్యాన్స్‌ గ్రేస్‌ చూసి బార్‌లోని వారే కాదు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 19, 2024, 07:48 PM IST
Viral Video: బార్‌లో పెద్దావిడ 'యానిమల్‌' స్టెప్పులు.. విజిల్స్‌, కెవ్వు కేకలతో అవ్వ వావ్వా

Lady Bobby Deol: సంచలన విజయం సొంతం చేసుకున్న 'యానిమల్‌' సినిమాలో 'జమల్‌ కుద్దు' పాటకు బాబీ డియోల్‌ ఎంట్రీ అందరికీ గుర్తుండే ఉంటుంది. తలపై మందు గ్లాస్‌ పెట్టుకుని డ్యాన్స్‌ చేసిన వీడియో ట్రెండింగ్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఏ బార్‌.. పబ్‌లోనైనా.. ఏ పార్టీలోనైనా ఈ డ్యాన్స్‌ లేనిది ఉండడం లేదు. అలాంటి డ్యాన్స్‌ ఓ పెద్దావిడ చేసింది. అది కూడా బీర్‌ బాటిల్‌ పెట్టుకుని. బీర్‌ సీసా తలపై పెట్టుకుని అసలు ఒక్కసారి కూడా కిందపడకుండా బాబీ డియోల్‌ మాదిరి డ్యాన్స్‌ చేయడం అందరినీ విస్తుగొలిపింది.

Also Read: Fake SI: పెళ్లిచూపులకు వెళ్లితే ఖంగుతినిపించిన యువతి.. మహిళా నకిలీ ఎస్సై కథలో ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు

ఏ బార్‌.. ఆమె ఎవరు అనే విషయాలు తెలియవు. కానీ పెద్దావిడ చీర కట్టుకుని నెత్తి మీద బీర్‌ సీసా పట్టుకుని 'యానిమల్‌' సినిమా పాటకు స్టెప్పులేసింది. అయితే ఆమె యానిమల్‌ డ్యాన్స్‌ పాటకు డ్యాన్స్‌ చేయలేదు. 'మేరే అంగ నేనే మే తుమ్హారా క్యా కామ్‌ హై' అనే పాటకు అదిరిపోయేలా ఆమె డ్యాన్స్‌ చేసింది. బార్‌ మొత్తం డ్యాన్స్‌ చేస్తూ తిరుగుతూనే ఉండగా బీర్‌ సీసా మాత్రం కొంచెం కూడా కదలలేదు. ఇక డ్యాన్స్‌ చేస్తూనే ఈల వేస్తూ అవ్వ హల్‌చల్‌ చేసింది.

Also Read: Shiraz Vlogger: యూట్యూబ్‌ మెచ్చిన పాకిస్థాన్‌ బుడ్డోడి కిర్రాక్‌ వీడియోలు.. చూస్తే నవ్వకుండా ఉండలేరు

అవ్వ డ్యాన్స్‌ చూసి అక్కడ ఉన్న కస్టమర్లు అవాక్కయ్యారు. అవ్వ డ్యాన్స్‌ చూసి ఫిదా అయిపోయారు. చప్పట్లు కొడుతూ.. కేరింతలు వేస్తూ సందడి చేశారు. ఒక యువకుడు అయితే అవ్వ డ్యాన్స్‌ చూసి దండం పెట్టేశాడు. ఆమెతో పాటు కలిసి కొన్ని స్టెప్పులు వేశాడు. అయితే ఒక సమయంలో సీసా కిందపడేట్టు కనిపించింది. దీంతో అందరూ ఆందోళన చెందారు. అనంతరం మళ్లీ సీసా కుదురుకోవడంతో అక్కడ ఉన్నవాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. 

దాదాపు నిమిషం వరకు ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. బామ్మ డ్యాన్స్‌ చూసి నెటిజన్లు అందరూ అవాక్కవుతున్నారు. అనంతరం డ్యాన్స్‌ చూసి ముచ్చట పడుతున్నారు. ఇలా ఒకసారి కాదు మళ్లీ మళ్లీ వీడియో చూస్తున్నారు. ఈ వీడియో లైక్‌లు, రీట్వీట్‌లతో ట్రెండింగ్‌లోకి వచ్చింది. లేడీ బాబీ డియోల్‌ అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'అవ్వ తగ్గేదేలే' అని కామెంట్లు చేస్తున్నారు. అవ్వా వావ్వా అంటూ కొనియాడుతున్నారు. అవ్వను ఏదైనా రియాల్టీ షోలో అవకాశం ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x