Adani Group Donation: కొన్ని వారాల కిందట భారీ వర్షాలు, వరదలతో అల్లాడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా ఊహించని భారీ విరాళం లభించింది. అది ఏకంగా రూ.25 కోట్లు విరాళం రావడం విశేషం. అంత భూరి విరాళం ఇచ్చిందెవరో కాదు ఇటీవల హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌. గౌతమ్‌ అదానీకి సంబంధించిన అదానీ గ్రూపు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆ విరాళం అందించింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chandrababu: సిక్కోలు నుంచి చంద్రబాబు 'ఇది మంచి ప్రభుత్వం' శ్రీకారం


భారీ వర్షాలతో కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుని భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. నిరాశ్రయులైన ప్రజలను ఆదుకునేందుకు పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారస్తులు, వివిధ రంగాల ప్రముఖులు తమకు తోచిన స్థాయిలో విరాళం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీ అయిన అదానీ గ్రూప్‌ విరాళం అందించింది. ఈ విషయాని అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ 'ఎక్స్‌' వేదికగా ప్రకటించారు.

Also Read: Tirumala Laddu: తిరుమల నెయ్యిపై చంద్రబాబు వ్యాఖ్యలు వైఎస్‌ షర్మిల ఖండన.. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు


ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించిన రూ.25 కోట్ల చెక్కును అదానీ గ్రూప్‌ తరఫున అదానీ పోర్ట్స్‌ ఎండీ కరణ్‌ అదానీ అందించారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి విరాళానికి సంబంధించిన చెక్కు బహూకరించారు. వరదలతో కలిగిన అపార నష్టం చూసి ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు తమ వంతు సహాయం అందిస్తున్నట్లు గౌతమ్‌ అదానీ తెలిపారు. కాగా ఏపీని ఆదుకునేందుకు మరికొందరు తరలివస్తున్నారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రి నారా లోకేశ్‌ను కలిసి విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఏపీకి చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ తేజ, విశ్వక్‌సేన్‌, సిద్ధూ జొన్నలగడ్డ, అనన్య నాగళ్ల తదితరులు వరద సహాయం అందించిన విషయం తెలిసిందే. కాగా విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు పది రోజుల పాటు అలుపెరగకుండా కృషి చేశారు.


మరికొన్ని విరాళాలు ఇలా


  • వరద బాధితుల సహాయార్ధం స్టీల్ ఎక్స్ఛైంజి ఇండియా లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు ప్ర‌తినిధులు మోహిత్, బన్సీ రూ.50 ల‌క్ష‌ల చెక్కు అందించారు.

  • ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే బూర్ల రామాంజినేయులు ప్రజల నుంచి సేకరించిన రూ.35 ల‌క్ష‌ల చెక్కు అందించారు.

  • వరద బాధితుల సహాయార్ధం గుంటూరుకు చెందిన గ‌డ్డిపాటి సుధాక‌ర్ దంప‌తులు రూ.20 ల‌క్ష‌ల చెక్కు బహుకరించారు.

  • ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్ల‌బ్‌ విశాఖప‌ట్నం ప్రతినిధులు రూ.10 ల‌క్ష‌ల చెక్కు ఇచ్చారు.



 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook