Wrinkles Removal Tips: కొబ్బరి నూనెతో ఈ రెండు కలిపి రాస్తే ముడతలు దూరం

Wrinkles Removal Tips: వయస్సుతో పాటు వృద్ధాప్య లక్షణాలు సాధారణం. ముఖం, కళ్లు, మెడ భాగంలో ముడతలు స్పష్టంగా కన్పిస్తుంటాయి. ఇదే ఏజీయింగ్ ప్రక్రియ. ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, జీవనశైలిలో మార్పు ద్వారా ముడతలు తగ్గించుకోవచ్చు

Wrinkles Removal Tips: కొన్ని హోమ్ రెమిడీస్ ద్వారా ఈ సమస్య నుంచి వేగంగా ఉపశమనం పొందవచ్చు. మీరు చేయాల్సిందల్లా కొబ్బరి నూనెలో ఈ పదార్ధం కలిపి అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా, ముడతల్లేకుండా చేయవచ్చు.

1 /4

కొబ్బరి నూనె, తేనె రాత్రి పడుకునే ముందు ముఖం శుభ్రం చేసుకుని కొబ్బరి నూనె తేనె కలిపి రాసుకోవాలి. ఒక చెంచా నూనెలో రెండు మూడు డ్రాప్స్ తేనె కలిపితే చాలు. రాత్రి రాసుకుని ఉదయం శుభ్రం చేసుకోవాలి.

2 /4

కొబ్బరి నూనెతో విటమిన్ ఇ కొబ్బరి నూనెలో విటమిన్ ఇ డ్రాప్స్ కలపడం వల్ల  మరింత ఎఫెక్టివ్ అవుతుంది. రాత్రి పడుకునే ముందు ముఖానికి రాయడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. రాత్రి పడుకునే ముందు రాసుకుని ఉదయం నీళ్లతో శుభ్రం చేసుకోవాలి

3 /4

చర్మ సంరక్షణలో కొబ్బరి నూనె కొబ్బరి నూనెలో విటమిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్స్ చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరి నూనె చర్మానికి రాయడం వల్ల పింపుల్స్, ముడతలు దూరమౌతాయి

4 /4

ముడతలు దూరం చేయడం ఎలా ముడతల నుంచి విముక్తి పొందేందుకు మార్కెట్‌లో క్రీమ్స్ వాడాల్సిన అవసరం లేదు. ఇంట్లో వస్తువులతోనే చర్మం యౌవనంగా, మృదువుగా, అందంగా చేయవచ్చు. కొబ్బరి నూనెతో ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.