AP Elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ మరి కొద్ది గంటల్లో వెలుడవనుంది. రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుంటే..ప్రతిపక్షాలు తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. మరోవైపు అన్ని పార్టీలు అభ్యర్దుల్ని దాదాపుగా సిద్ధం చేశాయి. ఈలోగా వెలువడిన ప్రముఖ సంస్థ సర్వే ఆసక్తి రేపుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవాళ ఇడుపులపాయ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్ధుల తుది జాబితా విడుదల చేయనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే సమయానికే వైసీపీ జాబితా విడుదల కానుంది. మరోవైపు తెలుగుదేశం-జనసేన కూటమిలో బీజేపీ చేరికతో సంభవించిన పరిణామాలపై రాష్ట్రంలో ఆసక్తి ఉంది. ఓటరు నాడి ఎలా ఉంది, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమితో ఓటరు మార్పు వచ్చిందా, ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలో వస్తుందనే విషయాన్ని పోల్ స్ట్రాటజీ గ్రూప్ ప్రీ పోల్ నిర్వహించింది. 


రాష్ట్రంలో తెలుగుదేశం-బీజేపీ-జనసేన జట్టు కట్టినప్పటికీ మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో వస్తుందని పోల్ స్ట్రాటజీ గ్రూప్ అంచనా వేసింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో వైసీపీ 118-128 స్థానాలు చేజిక్కించుకుంటుందని అభిప్రాయపడింది. అటు లోక్‌సభ విషయంలో కూడా వైసీపీ 17-19 స్థానాలు సాధించనుంది.  ఇక తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమికి ఏపీ అసెంబ్లీలో 47-57 స్థానాలు రానున్నాయి. లోక్‌సభలో 6-7 స్థానాలు లభిస్తాయి. తెలుగుదేశం పార్టీ మరోసారి ప్రతిపక్షానికి పరిమితమౌతుందని పోల్ స్ట్రాటజీ తెలిపింది. ఓటింగ్ శాతం కూడా భారీగా ఉండకపోవచ్చని తెలిపింది. 


ఇక ఓటింగ్ శాతం పరిశీలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు 49-51 శాతం ఓట్లు పడనున్నాయి. అదే తెలుగుదేశం కూటమికి 43-45 శాతం ఓట్లు పడతాయి. ఇతరులు మిగిలిన 5-7 శాతం ఓట్లు దక్కించుకుంటాయి. 


Also read: Dearness Allowance: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రెండు డీఏలు ప్రకటించిన సీఎం జగన్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook