AP Assembly Speaker: 2024లో దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అటు ఏపీ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా కలిసి పోటీ చేసి విజయం సాధించాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఆయనతో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిందే కదా.మొత్తంగా ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం తర్వాత ఏపీ శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకు ముందు ఈయనతో ప్రొటెం స్పీకర్ గా ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే.. నిన్న ఏపీ శాసనసభకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసారు. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు ఒక్కరే మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేయడంతో స్పీకర్ గా ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది. మరికాసేట్లో ఆయన స్పీకర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. నిన్న ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయలేదు. శనివారం ఉదయం ఆ ముగ్గురితో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు అయ్యన్నపాత్రుడిని స్పీకర్ చైర్ లో కూర్చోనున్నాు.


అయ్యన్న పాత్రుడు 156 సెప్టెంబర్ 4న చింతకాయ వరహాల దొర,చెల్లాయమ్మ దంపతులకు పుట్టారు. బీఏ వరకు చదవుకున్న 1983లో ఎన్టీఆర్.. తెలుగు దేశం పార్టీ స్థాపించినపుడు ఆ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాదు ఇప్పటి వరకు 10 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి 7 సార్లు విజయం సాధించారు. మరోవైపు రెండుసార్లు పార్లమెంట్ పోటీ చేసి ఒకసారి గెలిచారు.  1996లో లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు.  1998 లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అయ్యన్నపాత్రుడు.


1983 నుంచి మొదలు పెడితే.. 1985, 1994, 1999, 2004,2014, 2024లో శాసన సభ్యుడిగా ఎన్నియ్యారు. అంతేకాదు ఐదు సార్లు కేబినేట్ మంత్రిగా పనిచేశారు. 1985-87 మధ్య ఎన్టీఆర్ మంత్రివర్గంలో క్రీడలు మరియు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేసారు. 1994-96 మధ్య రోడ్డు భవనాల శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 1999-2004లో చంద్రాబు కేబినేట్ లో  అటవీ శాఖ, 2014-17 మధ్య పంచాయితీ రాజ్ శాఖ, 2017-19 మధ్య రోడ్డు, భవనాల శాఖ మంత్రిగా అయ్యన్నపాత్రుడు తనదైన ముద్ర వేశారు.  


2024లో నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా  7వ సారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంతేకాదు విభిజిత ఆంధ్ర ప్రదేశ్ 3వ శాసనసభ స్పీకర్ గా ఎన్నికయ్యారు.


Also Read: Kodali nani: మాజీ మంత్రి కొడాలి నానికి మరో బిగ్ షాక్.. గుడివాడలో కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter