AP Budget on March 11: ముగిసిన బీఏసీ సమావేశం, 11న బడ్జెట్, అచ్చెన్నాయుడుపై సీఎం వైఎస్ జగన్ సీరియస్
AP Budget on March 11: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన అంశాల్ని ఖరారు చేశారు. బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టేది నిర్ణయించారు.
AP Budget on March 11: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన అంశాల్ని ఖరారు చేశారు. బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టేది నిర్ణయించారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 25వ తేదీ వరకూ జరగనున్నాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అధ్యక్షత జరిగిన బీఏసీ సమావేశంలో కీలకమైన అంశాలపై చర్చించారు. టీడీపీ, వైసీపీల నుంచి చెరో 25 అంశాల్ని ప్రతిపాదించగా..బీఏసీ సమావేశం వాటిపై చర్చించేందుకు అనుమతించింది. సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, మంత్రులు బుగ్గన, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ నెల 11వ తేదీన అసెంబ్లీలో రాష్ట్ర బడ్టెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 8వ తేదీన గౌతమ్ రెడ్డి మృతికి సంతాపం తెలిపి..9వ తేదీన సభకు సెలవు ప్రకటించనున్నారు. అనంతరం 11వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అమరావతిపై హైకోర్టు తీర్పు నేపధ్యంలో శాసనసభ అధికారాలపై చర్చ జరగనుంది. కొత్త జిల్లాల బిల్లు సహా కీలకమైన బిల్లుల్ని ప్రవేశపెట్టనున్నారు.
మరోవైపు గవర్నర్ ప్రసంగం సందర్భంగా ప్రసంగ ప్రతుల్ని చింపి..ఆయనపై విసిరేయడాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్‌గా తీసుకున్నారు అచ్చెన్నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. గవర్నర్ వయసులో పెద్దవారని..ఆయనకు గౌరవం ఇవ్వాలని గుర్తు చేశారు.
Also read: AP Governor Address: అభివృద్ధి దిశగా ఏపీ పయనం, గవర్నర్ ప్రసంగంలో కీలకాంశాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook