Badvel bypoll updates : బద్వేల్ ఉప ఎన్నికల్లో వైస్సార్సీపీ, బీజేపీ మధ్య వాగ్వాదం
AP Badvel bypoll Updates sub inspector Chandrasekhar sacked from Badwell by election duties : బయటి వ్యక్తులు బీజేపీ ఏజెంట్లుగా ఎలా ఉంటారంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బీజేపీ ఏజెంట్లను అడ్డుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై చంద్రశేఖర్ ను ఎన్నికల విధుల నుంచి తొలగించారు అధికారులు.
AP Badvel bypoll Updates Conflict between YSRCP and BJP, sub inspector Chandrasekhar sacked from Badwell by election duties : ఏపీలోని బద్వేలులో వైస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న వెంకట సుబ్బయ్య (Venkata Subbayya) మృతితో అక్కడ నేడు ఉప ఎన్నిక (Badvel bypoll) జరుగుతోంది. అధికార వైస్సార్సీపీ తరఫున వెంకట సుబ్బయ్య సతీమణి సుధ, (Sudha) బీజేపీ నుంచి సురేశ్, కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే కమలమ్మ బరిలో ఉన్నారు.
అయితే బద్వేలు నియోజకవర్గ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ ఏజెంట్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) ఆరోపించారు. ఈ మేరకు విషయాన్ని జిల్లా ఎస్పీ అన్బురాజన్ దృష్టికి తీసుకెళ్లారు. గోపవరం మండలం బుట్టాయిపల్లి, జోగిరెడ్డిపల్లి గ్రామాల్లో బీజేపీ నేతలపై బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఎస్సై చంద్రశేఖర్‌పై (sub inspector Chandrasekhar) చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరువెంగళాపురం పోలింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలు లేకపోవడంపై సోము వీర్రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Also Read : Covid19 Vaccination: కరోనా సంక్రమణను ఆపని వ్యాక్సినేషన్, తాజా అధ్యయనం
ఇక చింతలచేరువులో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. బయటి వ్యక్తులు బీజేపీ ఏజెంట్లుగా ఎలా ఉంటారంటూ వైఎస్సార్సీపీ (YSRCP) కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బీజేపీ ఏజెంట్లను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అలాగే బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై చంద్రశేఖర్ ను బద్వేల్ ఉప ఎన్నికల (Badvel bypoll) విధుల నుంచి తొలగించారు అధికారులు.
Also Read : Aryan Khan Bail : బెయిల్‌పై బయటికొస్తున్న ఆర్యన్ ఖాన్.. ముస్తాబైన ‘మన్నత్’
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook