Badvel Bypoll: ఆంధ్రప్రదేశ్ బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. బద్వేలు అధికార పార్టీ ఎమ్మెల్యే హఠాన్మరణంతో అనివార్యమైన ఉపఎన్నికకు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ జరుగుతున్న ఏకైన అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక బద్వేలు(Badvel Bypoll). బద్వేలు అధికాపార్టీ ఎమ్మెల్యే ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. తెలంగాణలోని హుజూరాబాద్ ఉపఎన్నికతో పాటు బద్వేలు ఉపఎన్నిక జరగనుంది. బద్వేలు ఉపఎన్నిక మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. పోలింగ్ తొలిసారిగా సాయంత్రం 7 గంటల వరకూ జరగనుండటం విశేషం(Badvel Bypoll timings). ఇక ఉపఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని..నియోజకవర్గంలో ఓటున్న ప్రతి ఒక్కరూ ఓటేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కే విజయానంద్ స్పష్టం చేశారు.
బద్వేలు ఉపఎన్నికను స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా పటిష్టమైన ఏర్పాట్లు చేశామని మీడియాకు వివరించారు. మొత్తం పోలింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌తో పాటు వెబ్‌క్యాస్టింగ్ కూడా చేయనున్నట్టు చెప్పారు. 2019 సాధారణ ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో 77.64 శాతం పోలింగ్ నమోదైంది. ఆ సమయంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 4 వేల 618 కాగా 1 లక్షాల 58 వేల 863 ఓట్లు పోలయ్యాయి. ఇక అందులో పురుషులు 77 వేల 466 కాగా, మహిళలు అత్యధికంగా 81 వేల 394 మంది ఉన్నారు. ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం బద్వేలు నియోజకవర్గంలోని 7 మండలాల్లో 2 లక్షల 15 వేల 292 ఓట్లున్నాయి. ఇందులో పురుషులు 1 లక్షా 7 వేల 915 కాగా మహిళలు 1 లక్షా 7 వేల 355 ఉన్నారు. ఇక ట్రాన్స్‌జెండర్ల సంఖ్య కూడా పెరిగి 22కు చేరింది. వైఎస్సార్ కాంగ్రెస్(Ysr Congress party) తరపున దివంగత ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ సుధ బరిలో ఉండగా..ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పోటీ నుంచి తప్పుకుంది.
బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్‌కు అధికారులు సమాయత్తమయ్యారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈవీఎం, వీవీ ప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రి బద్వేలుకు తరలించారు. ఎన్నికల సామగ్రిని సంబంధిత పోలింగ్ అధికారులకు అందజేసి తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా చర్యలు చేపట్టారు(Badvel Bypoll live updates). ఎన్నికలకు విధులు కేటాయించిన పోలీసు యంత్రాంగమంతా బద్వేలు చేరుకుంది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగేవిధంగా ఇటు పోలీసు యంత్రాంగం, అటు అధికార యంత్రాంగం సిద్ధమైంది.
Also read: CM YS Jagan: ప్రతి గ్రామానికి ఇంటర్‌నెట్, డిజిటల్ లైబ్రరీలపై సీఎం జగన్ సమీక్ష
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook