ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆ పార్టీకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైపోయారు. బీజేపీని వదిలి జనవరి 26వ తేదీన జనసేనలో చేరేందుకు సన్నాహాలు చేసుకున్నారు. జనసేనాని సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్రంలో అధికారంలో ఉన్నా..పొరుగు రాష్ట్రం తెలంగాణలో బలపడుతున్నా ఏపీలో మాత్రం ఆ పార్టీ ఇంకా ఏటికి ఎదురీదుతూనే ఉంది. పార్టీ బలపడకపోగా ఉన్న నేతలు పార్టీ వీడుతున్నారు. ఈసారి ఏకంగా రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడే వీడ్కోలు పలుకుతున్నారు. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పార్టీని వీడనున్నారనేది దాదాపుగా ఖాయమైంది. ఈ నెల 26వ తేదీన జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. అంతేకాకుండా జనసేన తరపున సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని సమాచారం. సత్తెనపల్లి నుంచి పోటీకు జనసేనాని సైతం అంగీకరించారనే చర్చ నడుస్తోంది. 


ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజుకు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకు సరిపడటం లేదు. దీనికితోడు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో ఇటీవలే కన్నా లక్ష్మీ నారాయణ సమావేశమయ్యారు. అప్పుడే జనసేన పార్టీలో చేరతారనే ప్రచారం జరిగినా..కాదని కొట్టిపారేశారు. ఆ తరువాత నెమ్మదిగా ఈ అంశంపై క్లారిటీ వచ్చేసింది. రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే సత్తెనపల్లి టికెట్ జనసేనకు రావచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో సత్తెనపల్లి టికెట్ కన్నాకు దక్కవచ్చని సమాచారం. ఎందుకంటే కోడెల మరణానంతరం ఆ స్థానంలో టీడీపీ మరెవరినీ నియమించలేదు. 


సత్తెనపల్లి నుంచి ప్రస్తుతం అధికార పార్టీ తరపున మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో ఆయనకు పోటీగా ఉండే అభ్యర్ధి బలంగా ఉండాలనేది ప్రధాన ఆలోచన కన్నా లక్ష్మీ నారాయణ అయితే బాగుంటుందనేది జనసేన-టీడీపీ ఆలోచనగా ఉంది. 


Also read: Varahi Vehicle: మరి కాస్సేపట్లో వారాహికి పూజలు, కొండగట్టుకు చేరుకున్న జనసేనాని



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook