Varahi Vehicle: కొండగట్టు ఆంజనేయుని సన్నిధిలో వారాహికి పవన్ పూజలు

Varahi Vehicle: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి ప్రచార రధం ప్రారంభమైంది. వారాహి వాహనం కోసం ఇప్పటికే పవన్ కళ్యాణ్ తెలంగాణలోని కొండగట్టుకు చేరుకున్నారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 24, 2023, 01:11 PM IST
Varahi Vehicle: కొండగట్టు ఆంజనేయుని సన్నిధిలో వారాహికి పవన్ పూజలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ క్షేత్ర పర్యటన నిమిత్తం వారాహి వాహనాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేయించారు. తెలంగాణలోని కొండగట్టుపై వెలసిన ఆంజనేయునికి ప్రత్యేక పూజలు చేసి వాహనాన్ని ప్రారంభించారు.

కొద్జి సేపటి క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార రథం వారాహి ప్రారంభమైంది. దీనికోసం ఇప్పటికే ఆయన జగిత్యాల జిల్లా కొండగట్టుకు చేరుకున్నారు. కొండగట్టు, ధర్మపురిలలో ఆంజనేయుని చెంత వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకున్నారు. కొండగట్టు ఆంజనేయునితో పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక అనుబంధముంది. గతంలో చాలాసార్లు ఈ ఆలయాన్ని ఆయన సందర్శించారు. 2024 ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని రాజకీయ పర్యటనకై ప్రత్యేకంగా హైదరాబాద్ లో చేయించిన వారాహి వాహనాన్ని కొండగట్టులో ప్రత్యేక పూజలతో ప్రారంభించేందుకు సంకల్పించారు. 

పూజల కోసం హైదరాబాద్ నుంచి కొండగట్టుకు కాస్సేపటి క్రితం చేరుకున్నారు. జగిత్యాల డీఎస్ప ఆధర్వంలో 200 మంది పోలీసులతో పటిష్టమైన భద్రత ఏర్పాటైంది. మామూలుగానే మంగళ, శనివారాల్లో కొండగట్టు అంజన్న దేవాలయానికి భక్తులు పెద్దఎత్తున వస్తుంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్ పర్యటన కావడంతో భారీగా జనం తరలివచ్చారు. ముందు జాగ్రత్తగా పెద్దఎత్తున పోలీసులు మొహరించారు. 

ముందుగా వారాహి వాహనానికి  జనసేనాని పవన్ కళ్యాణ్ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. వారాహికి కొండగట్టులో పూజల తరువాత నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ నేతలతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేుకుంటారు. ఆ తరువాత ఇతర నరసింహ స్వామి ఆలయాలను దర్శించనున్నారు.

Also read: Oscar Nominations: ఆస్కార్ నామినేషన్ల అధికారిక ప్రకటన ఇవాళే, ఆర్ఆర్ఆర్ పరిస్థితి ఏంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News