Visakha steel plant issue: కేంద్ర ఉక్కుశాఖ మంత్రితో సమావేశమైన ఏపీ బీజేపీ నేతలు
Visakha steel plant issue: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీజేపీను ఇరకాటంలో పడేసింది. ఏపీలో ప్రతిపక్ష స్థానంపై కన్నేసిన బీజేపీకు స్టీల్ ప్లాంట్ విషయం అడ్డంకిగా మారింది. అందుకే కేంద్రంలోని పెద్దలతో ఏపీ బీజేపీ నేతలు చర్చలు జరిపారు.
Visakha steel plant issue: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీజేపీను ఇరకాటంలో పడేసింది. ఏపీలో ప్రతిపక్ష స్థానంపై కన్నేసిన బీజేపీకు స్టీల్ ప్లాంట్ విషయం అడ్డంకిగా మారింది. అందుకే కేంద్రంలోని పెద్దలతో ఏపీ బీజేపీ నేతలు చర్చలు జరిపారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం వెనుకున్న బలమైన ఉద్యమం, సెంటిమెంట్ ఆధారంగా సాధించుకున్న పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ ( Visakha steel plant ). ఈ పరిశ్రమను ప్రైవేట్‌పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ( Central government ) తీసుకున్న నిర్ణయం విశాఖ ఉక్కుకోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. ఏపీలోని అధికార పార్టీ సైతం ఇప్పటికే ఉద్యమానికి బాహాటంగా మద్దతిస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ సైతం విశాఖ ఉక్కు విషయంలో లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని భావిస్తున్న ఏపీ బీజేపీ పెద్దలకు సంకటం ఎదురైంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కావడంతో ఏం చేయాలో తోచని సందిగ్ద పరిస్థితి ఎదుర్కొన్నారు.
అందుకే ఏపీ బీజేపీ నేతలు ( Ap bjp leaders ) ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశమయ్యారు. సుమారు అరగంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. సమావేశం తరువాత భేటీ వివరాలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ( Ap bjp president somu veerraju ) వివరించారు. స్టీల్ ప్లాంట్‌పై ప్రజల సెంటిమెంటును కేంద్రమంత్రికి వివరించామని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ప్రత్యామ్నాయాలు చూడాలని కోరామన్నారు. బ్యాంకుల విలీనం తరహాలోనే, వేరే ప్రభుత్వ రంగ సంస్థలలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. అందరి ప్రయోజనాలు కాపాడాలని కోరినట్లు సోము తెలిపారు. అయితే ఏపీ నేతలతో భేటీ అనంతరం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్‌పరం చేయవద్దని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ప్రధాని మోదీ ( Pm modi )కు లేఖ రాశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also read: Ap municipal Elections: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల, మార్చ్ 10న పోలింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook