ఏపీ అసెంబ్లీలో ఆర్ధికమంత్రి యనమల ప్రవేశపెట్టిన బడ్జెట్ 2018 జనాకర్షణను ప్రతిబింబిస్తోంది. ఈ బడ్జెట్ స్వరూపం చూస్తే ఒక వైపు ఆర్ధిక రంగాన్ని ఉరకలెత్తించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తూనే ప్రజా సంక్షేమం దిశగా సాగింది. ఆర్ధికంగా  వెనకబడిన వారితో పాటు సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్గాలకు సంతృప్తినిచ్చే విధంగా కేటాయింపులు జరిగాయి. మహిళలు, యువత కోసం భారీ కేటాయింపులు జరిగాయి. దీనికి తోడు 28 కొత్త పథకాలనూ తెరపైకి తెచ్చారు ఆర్ధిక మంత్రి యనమల. అలాగే లోటు బడ్జెట్ కు ఇక ఇక్కడితో చెల్లు చీటీ అంటూ 2018-19 ఆర్ధిక సంవత్సరానికి మిగులు బడ్జెట్ ను ప్రతిపాదించడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బడ్జెట్ హైలెట్స్: 


బడ్జెట్ మొత్తం రూ.1,91,063.61 కోట్లు
రెవెన్యూ వ్యయం : రూ. 1,50,271.99 కోట్లు
మూల ధన వ్యయం :రూ.28,678 కోట్లు 
రెవెన్యూ మిగులు రూ.5,235.24 కోట్లు 


పోలవరానికి రూ.9 వేల కోట్లు
నిరుద్యోగ భృతికి రూ.100 కోట్లు
ఆదరణ పథకానికి రూ.750 కోట్లు
బడికొస్తా పథకానికి రూ.160 కోట్లు


* సాంఘీక సంక్షేమానికి రూ.3 వేల 221 కోట్లు
* గిజిజన సంక్షేమానికి రూ.4 వేల 176. కోట్లు
* మైనార్టీలకు రూ.1102 కోట్లు


* బీసీ సంక్షేమానికి రూ.6,210 కోట్లు
  కాపులకు రూ.1000 కోట్లు
   రజకులకు  రూ. 70 కోట్లు
   దూదేకులు రూ 40 కోట్లు
   గీత కార్మికులకు రూ. 70 కోట్లు
   వాల్మీకి/ బోయలకు రూ. 50 కోట్లు
   వడ్డెరలకు రూ. 50  కోట్లు
   నాయీ బ్రహ్మణులు రూ. 35  కోట్లు


నిధులివ్వడంలో కేంద్రం మొహం చాటేస్తున్న రాష్ట్రంలో తగినంత ఆదాయం లేకున్నా విత్త మంత్రి కేటాయింపుల విషయంలో ఏమాత్రం ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఏడాదిలో రాబోతున్న ఎన్నికలు తగ్గట్టే సర్వ జన సంతృప్తికి పట్టం కట్టినట్లు ఆర్థిక మంత్రి యనమల బడ్జెట్ ను ప్రవేశపెట్టారని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.