అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీలో అన్నదాత సుఖీభవ పథకంపై  చర్చ జరిగింది. ఈ సమావేశంలో అన్నదాత సుఘీభవ పథకానికి  సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించారు. ఈ క్రమంలో ప్రతి రైతుకు ఏడాదికి ఒక్కో ఎకరాకు రూ.10 వేల ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయించారు. కేబినెట్ భేటీ అనంతరం మీడియా ముందుకు వచ్చిన మంత్రి సోమిరెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ఇచ్చే రూ.6 వేల సహాయానికి రూ.మరో 4 వేల కలిపి ఈ మొత్తం 10 వేలు ఇస్తామన్నారు. ఆర్ధిక సాయం రెండు విడుతల్లో ఇవ్వాలని నిర్ణయించినట్లు సోమిరెడ్డి పేర్కొన్నారు


ఈ సందర్భంగా మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ కేంద్రం.. ఐదు ఎకరాల లోపు వారికే ఆర్ధిక సాయం అని లింక్ పెట్టింది. కేంద్రం పెట్టిన నిబంధనలతో 50 లక్షల మంది రైతుల మాత్రమే లబ్ది పొందుతారు.  తాజాగా తాము తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ.. ప్రతి రైతు కుటుంబానికి  కేంద్ర సాయంతో సంబంధం లేకుండా రూ.10 వేలు ఆర్ధిక సాయం అందిస్తామని ఏపీ మంత్రి సోమిరెడ్డి పేర్కొన్నారు. అలాగే ఖరీఫ్ రీజన్ లో కౌలు రైతులకు ఆర్ధిక సాయం చేయాలని  నిర్ణయించామని మంత్రి సోమిరెడ్డి తెలిపారు