ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్నదాన సుఖీభవపై చర్చించిన కేబినెట్..విధి విధానాల రూపకల్పన చేశారు. ప్రతి రైతుకు ఏడాదికి సాగు కోసం రూ.10 వేల ఇవ్వాలని నిర్ణయించారు.
అలాగే గిరిజనులకు 50 ఏళ్లకే పింఛన్, గ్రీన్ కారిడార్ వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే సమయంలో ఢిల్లీ ధర్మాపోరాట దీక్ష, ఏపీ హక్కుల సాధన పోరాటం కోసం భవిష్యత్తు కార్యచరణపై కూడా చర్చించారు.
ఐఏఎస్, ఐపీఎస్ లకు అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయింపు, జర్నలిస్టులకు 30 ఎకరాల స్థలం కేటాయింపు, అలాగే ఎన్జీవోలు, సచివాలయ ఉద్యోగులకు 175 చదరపు గజాల స్థలం కేటాయిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గజానికి రూ.4 వేల చొప్పన 230 ఎకరాలు కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.