AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆమోదముద్ర వేయడంతో పాటు విశాఖ లైట్ మెట్రో కారిడార్‌కు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి నుంచి అమలు కానున్న సంక్షేమ పథకాలపై నిర్ణయాలు తీసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో కీలకాంశాలకు ఆమోద ముద్ర లభించింది. ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న లైట్ మెట్రో కారిడార్ డీపీఆర్‌ను కేబినెట్ ఆమోదించింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఖర్చును 25 లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ ఈ పరిమితి 5 లక్షల రూపాయలు మాత్రమే ఉంది. ఈనెల 18వ తేదీన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు కొత్త కార్డులు జారీ చేయనున్నారు. జనవరిలో అమలు చేయనున్న జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ విడత, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాలకు కేబినెట్ ఆమోదించింది. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య పెన్షన్‌ను జనవరి నుంచి 3 వేల రూపాయలు చేస్తూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. 


రాష్ట్రంలో కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరు సంస్కరణలకు మంత్రివర్గం ఆమోదించింది. విశాఖ మెట్రో డీపీఆర్ 4 రూట్లలో ప్రారంభించేందుకు ఏపీ కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ సమావేశం జరుగుతుండగా రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ సాబ్జి మరణవార్త తెలియడంతో కేబినెట్ 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపింది. 


Also read: MLC Sabji Died: పశ్చిమలో రోడ్డు ప్రమాదం, ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook