ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా  ఏపీ కంప్లసరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజస్ యాక్ట్-2002కు సవరణలు చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్సుకి ఆమోదం లభించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే చంద్రన్న పెళ్లికానుకకు సంబంధించి అన్ని వర్గాలకు ఒకే వేదిక ద్వారా మొత్తాన్ని అందించేందుకు అవసరమైన కార్యాచరణ నిమిత్తం తెచ్చిన ఆర్డినెన్సు కూడా ఆమోదం పొందింది.


అలాగే ఈ సమావేశంలో  సీఆర్‌డీఏలో కార్యాలయాలకు 51.92 ఎకరాలను అమరావతిలో కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పదకొండవ పే కమీషను ఏర్పాటుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలపడం గమనార్హం. ఇదే సమావేశంలో పలు సంస్థలకు రాజధానిలో స్థలాల కేటాయింపుల విషయంపైన కూడా చర్చించారు