AP Cinema Ticket Issue: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సినీ పరిశ్రమ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తుంది. తెలుగు సినీ ప్రముఖులలో కొందరు చిరంజీవి, రాజమౌళి, కొరటాల శివ, హీరోలు ప్రభాస్, మహేష్ బాబులతో పాటు ఆర్ నారాయణ మూర్తి, కమెడియన్ అలీ, పోసాని కృష్ణ మురళి ఇటీవలే ఏపీ సీఎం జగన్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం మూవీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకొచ్చారు. అయితే వారి సమస్యలను సినిమా టికెట్ల కమిటీ ముందుంచగా.. వాటిపై నేడు (ఫిబ్రవరి 17) సదరు కమిటీ సమీక్ష జరపనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ సమావేశానికి సంబంధించిన అన్ని డ్రాఫ్ట్ రికమండేషన్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జీవో 35 ప్రకారం నాలుగు ప్రాంతాల వారీగా కాకుండా మూడు కేటగిరీల్లో కమిటీ సిఫారసు చేసింది.


గతంలో ఉన్న గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ కేటగిరీలను కలిపి నగర పంచాయతీ ఏరియాగా సదరు కమిటీ సిఫారసు చేసినట్లు సమచారం. దీంతో నగర పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ వారీగా సినిమా టికెట్ రేట్లను కమిటీ సిఫారసు చేయనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. 


మరోవైపు ప్రతి థియేటర్ లోని టికెట్ క్లాసుల సవరణకు సూచనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న మూడు క్లాసులకు బదులుగా రెండు క్లాసులనే కొనసాగించేందుకు కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై అన్నీ థియేటర్లలో ఎకానమీ, ప్రీమియం క్లాసులు మాత్రమే ఉండనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే అందుకు 60 : 40 నిష్పత్తిలో ప్రీమియం, ఎకానమీ కేటగిరీలను నిర్ణయించినట్లు తెలుస్తోంది.  


Also Read: Guntur Minor rape case: గుంటూరులో దారుణం... మైనర్ బాలిక అత్యాచారం కేసులో 64 మంది అరెస్ట్


Also Read: Somu Veerraju: మోదీని తరిమేస్తారా.. బీ కేర్ ఫుల్.. కేసీఆర్‌కు సోము వీర్రాజు వార్నింగ్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి