Nellore district Kovur YSRCP MLA Nallapareddy Prasanna Kumar Reddy sensational comments on tollywood: ఏపీలో గత కొంత కాలంగా సినిమా టికెట్ల వివాదం కొనుసాగుతూ ఉంది. సినిమా టికెట్ రేట్స్ (Movie ticket rates) విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Government of Andhra Pradesh) తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ టాలీవుడ్‌ నుంచి పలువురు ప్రముఖులు విమర్శలు చేస్తున్నారు. మరికొందరేమో ఏపీ సర్కార్ (Andhra Pradesh Government) తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక టాలీవుడ్ (Tollywood) నుంచి వస్తోన్న విమర్శలను వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తిప్పి కొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక వైస్సార్సీపీ ఎమ్మెల్యే తెలుగు సినిమా ఇండస్ట్రీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ స్టార్స్‌పై సంచలన కామెంట్స్ చేశారు. 


సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారంటూ నెల్లూరు జిల్లా కోవూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి (YSRCP MLA Nallapareddy Prasanna Kumar Reddy) విమర్శించారు. అసలు సినిమా వాళ్లకు ఏపీ గుర్తుందా అని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ ప్రశ్నించారు. పెద్ద సినిమా టికెట్‌లను రూ. 1000 నుంచి రూ. 2000 దాకా అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే (MLA) ఆరోపించారు.


Also Read : ఫార్మూలా వన్ రేసులో దుమ్ముదులుపుతున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?


సినిమా టికెట్ రేట్స్‌ను (Movie Ticket Rates‌) తగ్గిస్తే సామాన్యులు కూడా పెద్ద సినిమాలు చూస్తారని ఉద్దేశంతోనే ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం (YSRCP Government) టికెట్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు. అయినా ఇందులో తప్పేముంది ఆయన ప్రశ్నించారు. ఇక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే (YSRCP MLA) నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. టాలీవుడ్‌లో (Tollywood‌) హాట్ టాపిక్‌గా మారాయి. ఇక సినిమా టికెట్ రేట్ల విషయంపై ఇవాళ టాలీవుడ్‌ డైరెక్టర్ రామ్‌ గోపాల్‌ వర్మ, (Tollywood director Ram Gopal Varma) ఏపీ మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. సినిమా టికెట్ల రేట్ల (Movie ticket rates) తగ్గింపుపై వీరిద్దరి మధ్య చర్చ సాగుతోంది. 


Also Read : Monkeys Snatch Baby: 2 నెలల పసికందును ఎత్తుకెళ్లి.. నీళ్ల ట్యాంకులో పడేసిన కోతులు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి