Netizens brutally trolls Director Ramgopal Varma over AP Movie Ticket Rates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (AP Govt)లో సినిమా టికెట్ ధర (Movie Ticket Price)ల విషయంపై గత కొన్నిరోజుల నుంచి వాడివేడిగా సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ramgopal Varma) వరుస ట్వీట్లతో ప్రభుత్వ నిర్ణయాలను సవాలు చేస్తున్నారు. ప్రతిరోజు ఆర్జీవీ చేసే ట్వీట్లు అగ్గికి ఆజ్యం పోస్తున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే.. సినిమా టికెట్ ధరల తగ్గింపు విషయంపై ఏపీ ప్రభుత్వం, రామ్‌గోపాల్ వర్మల మధ్య ట్విటర్ వార్ నడుస్తోంది. ఎందరు ఎమన్నా పట్టించుకోకుండా ముందుకు దూసుకుపోతున్న ఆర్జీవీ.. శనివారం కూడా వరుస ట్వీట్లు చేశారు.
సినిమాల మాదిరిగానే థీమ్ పార్కుల ధరలూ ప్రభుత్వం నిర్ణయించలేదని శనివారం ఉదయం సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (RGV) ట్వీట్ చేశారు. 'సినిమా మాదిరిగానే థీమ్ పార్కులు, మ్యూజిక్ కాన్సర్ట్స్, మ్యాజిక్ షోలు కూడా ఎంటర్‌టైన్‌మెంట్ కిందకే వస్తాయి. వీటి ధరల్ని కూడా ప్రభుత్వం నిర్ణయించదు' అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. అక్కడితో ఆగకుండా తాజాగా తన ఫొటోలు పోస్ట్ చేసి.. సామెతలు కూడా చెప్పాడు. వాటికి తను ఇచ్చిన హావభావాలు హైలెట్‌గా నిలిచాయి. అయితే ఆర్జీవీ తాజా పోస్టు ప్రేక్షకులకు ఆగ్రహం తెప్పించాయి. దాంతో ఆర్జీవీపై కామెంట్ల వర్షం (Trollls on RGV) కురుస్తోంది.
ఒరేయ్ సుబ్బారావు ల్లారా నేను అడిగిన క్వశ్చన్ లీగల్ జ్యూరిస్ట్రిక్షన్ లో ఉంది. మీరిచ్చే ఎగ్జాంపుల్స్ అన్నీ క్రిమినల్ యాస్పెక్ట్స్ లో ఉన్నాయి pic.twitter.com/LUe16OXZAW
— Ram Gopal Varma (@RGVzoomin) January 8, 2022
'ఒరేయ్ సుబ్బారావు ల్లారా.. నేను అడిగిన క్వశ్చన్ లీగల్ జ్యూరిస్ట్రిక్షన్ లో ఉంది. మీరిచ్చే ఎగ్జాంపుల్స్ అన్నీ క్రిమినల్ యాస్పెక్ట్స్ లో ఉన్నాయి' అని రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఆ పోస్టులో 'విటుడికి, వేశ్యకు ఇబ్బందిలేనపుడు.. పోలీసులకు ఏంటో నొప్పి', 'లంచం ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడికి ఇబ్బందిలేనపుడు.. ఏసీబీకి ఏంటి నొప్పి', 'టికెట్ రేట్లు పెంచేవాడికి చూసేవాడికి ఇబ్బందిలేనపుడు.. ప్రభుత్వానికి ఏంటి నొప్పి?' అని ప్రశ్నించాడు. ఈ పోస్ట్ చూసిన సినిమా అభిమానులు (Film Fans), నెటిజన్లు (Netizens) ఆర్జీవీని ఆడేసుకుంటుంటారు. 'ఆర్జీవీ సర్.. ప్రేక్షకుడికి నొప్పి లేదని నీకు ఎవర్ చెప్పారు?! నేను 1000 పెట్టి టికెట్ కొనలేను' అని ఒకరు ట్వీట్ చేశారు. 'దేవుడు లేడు అనడం ఎంత తప్పో నొప్పి లేదు ఆనడమూ తప్పే.. ఎక్కడ ఎవరి పని వారు చేసుకొంటూ పోతారో అక్కడ నొప్పి అనివార్యం' అని ఇంకొకరు ట్వీట్ చేశారు.
Also Read: మా అక్కతో రాఘవకు అక్రమ సంబంధం.. సంచలనం రేపుతున్న నాగ రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో..
ప్రేక్షకుడికి ఇబ్బంది లేదు అని నీకు ఎవర్ చెప్పారు ? నాకు ఇబ్బందే, 1000 రూపాయలు పెట్టీ నేను కొనలేను 👍
— Anonymous77077 (@anonymous77077) January 8, 2022
దేవుడు లేడు అనడం ఎంత తప్పో
నొప్పి లేదు ఆనడమూ తప్పుఎక్కడ ఎవరి పని వారు చేసుకొంటూ పోతారో
అక్కడ నొప్పి అనివార్యం— #తెలుగుసాహిత్యం (@vennelarajyam) January 8, 2022
1.పోలీసుకి నొప్పి ఏంటా? నీకు ఇష్టమైన ఒక స్త్రీని వేశ్యగా మార్చి ,విటుడు గా ఎవడొకరు వెళ్తే నొప్పి రాదా ?అది సమాజ శ్రేయష్షుకు హాని ,లేకపోతూ ప్రతొడు ని కంపెనీకె వస్తాడు.
2.అసలు తీసేవాడు లేకపోతే చూసేవాడు ఎవడు.(బ్లూ ఫిల్మ్)
3.టికెట్లు పెంచితే ఇబ్బంది లేదు అని ఎవడు నీతో చెప్పాడు.— 🤫🤔🤭🤩🤗 (@00657nvk) January 8, 2022
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
ఆర్జీవీ సర్.. ప్రేక్షకుడికి నొప్పి లేదని నీకు ఎవరు చెప్పారు?! నేను 1000 పెట్టి టికెట్ కొనలేను!!
సామెతలు చెప్పిన రామ్‌గోపాల్ వర్మ
ప్రేక్షకుడికి నొప్పి లేదని నీకు ఎవరు చెప్పారు
ఆర్జీవీపై కామెంట్ల వర్షం