RK ROJA: చంద్రబాబు దెబ్బకు రోజా ఖతం!
CM Chandra babu bit shock to Roja: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓ వైసీపీ మాజీమంత్రికి సీఎం చంద్రబాబు చెక్ పెట్టారా..! వైసీపీ అధికారంలో ఉండగా చెలరేగిపోయిన ఆ మహిళా మంత్రికి నోటికి తాళం పడేలా చేశారా..! సీఎం చంద్రబాబు దెబ్బకు ఆ మాజీమంత్రి సైలెంట్ అయ్యారా..! ఆ మహిళా నేత విషయంలో చంద్రబాబు చేసిన ప్రయోగమేంటి..!
RK ROJA: వైసీపీ మహిళా నేత, మాజీమంత్రి ఆర్కే రోజా ఓ ఫైర్ బ్రాండ్ లీడర్.. వైసీపీ సర్కార్ అధికారంలో ఉండగా.. మంత్రి పదవి చేపట్టి తల కలను సాకారం చేసుకున్నారు. తాము అధికారంలో ఉండగా.. ఎదురేలేదు అన్నట్టు ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగత దూషణలతో తిట్టిపోశారు. అప్పట్లో ఆమెకు వైసీపీ హైకమాండ్ నుంచి పూర్తి స్వేచ్ఛ దొరకడంతో ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. దాదాపు ఐదేళ్లు కూటమి పార్టీలోని నేతలందర్నీ ముప్పుతిప్పులు పెట్టిన రోజా.. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీసీ ఓడిపోవడంతో పత్తా లేకుండా పోయారు. ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గానికి ముఖం చాటేసిన ఆర్కేరోజా.. తన మకాంను చెన్నైకు మార్చినట్టు ప్రచారం సైతం జరుగుతోంది.
ఆర్నెళ్ల క్రితం వైసీపీ అధికారం కోల్పోయాక.. చాలామంది లీడర్లు పత్తా లేకుండా పోయారు. ఇందులో ఆర్కే రోజా కూడా ఒకరు.. చంద్రగిరి నియోజకవర్గంలో పదేళ్లు చక్రం తిప్పిన రోజాకు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సొంత పార్టీ లీడర్లే షాక్ ఇచ్చారట. అప్పట్లో రోజా అభ్యర్ధిత్వాన్ని చాలామంది స్థానిక లీడర్లు వ్యతిరేకించినట్టు తెలిసింది. అంతేకాదు పరోక్షంగా వీరంతా రోజా ఓటమికి కారణం కూడా అయ్యారట. అయితే సొంత పార్టీ లీడర్లే తనను ఓడగొట్టారన్న సమాచారంతో రోజా చంద్రగిరి ముఖం చూపించడమే మానేశారట. ఇటీవల పార్టీ హైమాండ్ ఆదేశాల మేరకు అప్పుడప్పుడు చుట్టపుచూపుగా నియోజకవర్గానికి వచ్చిపోతున్నట్టు తెలిసింది. అయితే చంద్రగిరికి వచ్చినప్పుడల్లా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం రోజాకు ఆనవాయితీగా వస్తోంది..
వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత అనేకసార్లు తిరుమల శ్రీవారిని మాజీమంత్రి రోజా దర్శించుకున్నారు. అయితే శ్రీవారి దర్శనం కాగానే.. మీడియాతో మాట్లాడేవారు. కొండపైన రాజకీయ ప్రసంగాలు ఇవ్వొద్దనే ఆదేశం ఉన్నప్పటికీ వాటిని పట్టించుకునేవారు కాదు.. ఈ సంప్రదాయాన్ని వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత కూడా రోజా కంటిన్యూ చేసే ప్రయత్నం చేశారు. అనేక మార్లు తిరుమల కొండపై రాజకీయ ప్రసంగాలు చేశారు. కానీ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా నోరు తెరవకుండా వెళ్లిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మొత్తంగా తిరుమల కొండపై వైసీపీ లీడర్లకు నోటికి తాళం వేయడంలో చంద్రబాబు సక్సెస్ తెలుస్తోంది. గతంలో కొండపైనే రాజకీయం చేసినా రోజాకు దిమ్మతిరిగే రేంజ్‌లో చెక్ పెట్టినట్టు సమచారం.. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా బీఆర్ నాయుడిని నియమించారు సీఎం చంద్రబాబు. అయితే సీటులో కూర్చోవడమే ఆలస్యం అన్నట్టు బీఆర్ నాయుడు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడితే కేసులు కట్టి బొక్కలో వేస్తామంటూ హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలోనే రోజా నోటికి పడిందనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది..
Also Read: పుష్ప ఈవెంట్ అల్లు అర్జున్ ప్రైవేట్ సైన్యం
Also Read: Constable Killed: కానిస్టేబుల్ హత్యలో సంచలన విషయాలు: చెడిపోయిన అక్క.. మట్టుబెట్టిన తమ్ముడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.