ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీకానున్నారు. దాదాపు ఏడాది తరువాత మోదీ, చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ప్రధాని, సీఎంల భేటీ జనవరి 12వ తేదీన ఢిల్లీలో జరగనుంది. ఈ మేరకు మోదీతో చంద్రబాబు అపాయింట్మెంట్ ఖరారైనట్టు పీఎంవో వర్గాలు వెల్లడించాయి. 


ఇప్పుడు వీరిద్దరి కలయిక ఆసక్తిని రేపుతోంది. ఈ మధ్యకాలంలో బీజేపీ, టీడీపీలు ఎడమొహం, పెడమొహం అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. కొన్నిచోట్ల విభేదాలు కూడా వచ్చాయి. అందుకే సీఎంకు పీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ మధ్య కొందరు బీజేపీ నేతలు కూడా టీడీపీపై విమర్శలు చేశారు. అయితే సీఎం టీడీపీ శ్రేణులకు సంయమనం పాటించండి అంటూ పిలుపునివ్వడంతో ఎవ్వరూ బీజేపీపై విమర్శలు చేయటంలేదు. కాగా.. ఈ నెల 12వ తేదీ జరిగే ఈ భేటీలో ప్రధానంగా విభజన హామీలు, పోలవరంతో పాటు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.